Begin typing your search above and press return to search.
మోసం చేసిన ప్రియుడు ..జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య !
By: Tupaki Desk | 30 Sept 2021 12:00 PM ISTమనచావాచా ఎంతో ఇష్టం పడి ప్రేమించిన వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్న యువతి అతడు చేసిన మోసాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహం లభించగా, బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సమీపంలోని గాజులరామారానికి చెందిన కావలి అనురాధ సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది.
కిరణ్ అనే యువకుడిని ఆరేళ్లుగా ప్రేమిస్తోంది. అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో మూడు నెలల నుంచి ఫిలింనగర్ లోని జ్ఞానిజైల్ సింగ్ నగర్ లోని ఓ ఇంట్లో అతడితో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో అదే అపార్ట్‌మెంట్ లో నివసిస్తున్న కొందరు యువకులు విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. లోపల ఓ గదిలో అనురాధ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనురాధను పెళ్లాడతానని నమ్మించి ఆమెకు తెలియకుండా మరో యువతితో కిరణ్ నిశ్చితార్థం చేసుకున్నాడని, ఈ మోసాన్ని భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని బాధిత యువతి సోదరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కిరణ్ కోసం గాలిస్తున్నారు. అనురాధ మృతితో గాజులరామారాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి, అనురాధ మృతికి కారణమైన కిరణ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.