Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ః 'హీరోయిన్'కు బికినీ వేశారు

By:  Tupaki Desk   |   3 Oct 2017 1:39 PM GMT
ట్రైలర్ టాక్ః హీరోయిన్కు బికినీ వేశారు
X
అబ్బే.. హీరోయిన్ లక్ష్మీ రాయ్ కు ఒకరు బికినీ వేసేదేంటండీ? ఆ పిల్లది ఆల్రెడీ చాలాసార్లు బికినీ వేసుకుని సోషల్ మీడియాలో హల్ చల్ చేసిందిగా. అయితే ఇప్పుడు ''జూలి 2'' సినిమా తాలూకు ధియేట్రికల్ ట్రైలర్ చూసినోళ్ళు మాత్రం.. 'హీరోయిన్' గురించే మాట్లాడుకుంటున్నారు. పదండి ఏంటో చూద్దాం.

ఇక్కడ 'హీరోయిన్' అంటే.. కరీనా కపూర్ హీరోయిన్ గా మధుర్ బండార్కర్ డైరక్షన్లో వచ్చిన 'హీరోయిన్' సినిమానేనండీ బాబూ. ఆ సినిమాలో ఒక అమ్మాయి స్టార్ హీరోయిన్ అవ్వడానికి కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటుంది. అక్కడి నుండి ప్రొడ్యూసర్లతో ఎఫైర్లు.. క్రికెటర్ తో రొమాన్సులు.. చివరకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండ్ డైరక్టర్ మోసాలు చేయడం.. ఇవన్నీ జరుగుతాయి. చివర్లో.. నాకిదంతా వద్దు.. ప్రశాంతమైన జీవితం కావాలి.. అంటూ అన్నీ వదిలేసి వెళిపోతుంది కరీనా. ఆ సినిమాలో కనుక కరీనాను తీసేసి లక్ష్మీరాయ్ ను పెట్టేసి.. ఓ పది సీన్లలో డజను బికినీలు వేయిస్తే.. అదే ''జూలీ 2'' సినిమా అన్నట్లు ట్రైలర్ చూస్తే.. ఎడల్ట్ సినిమాలను రెగ్యులర్ గా చూసే టీనేజ్ పిల్లలు ఎవరైనా చెబుతారు.

కేవలం విపరీతంగా డబ్బులు ఖర్చుపెట్టించిన దర్శకుడు దీపక్ శివదాసానీ.. ఈ సినిమాలో కంటెంట్ ను నింపాడో లేదో కాని.. లక్ష్మీ రాయ్ గ్లామర్ తో సీన్లన్నీ నింపేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయ్. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే.. సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.