Begin typing your search above and press return to search.

ధోని మ్యాటర్ వదిలేయడం మంచిది

By:  Tupaki Desk   |   19 Sep 2017 5:05 AM GMT
ధోని మ్యాటర్ వదిలేయడం మంచిది
X
ప్రస్తుత రోజుల్లో క్రికెట్ గ్రౌండ్ లో ఆడే ఆటగాళ్లకు తెరపై మెరిసే ముద్దుగుమ్మలకు పరిచయాలు చాలా ఈజీగా ఏర్పడి.. స్నేహం వరకు వెళుతుంటాయి. ఇక స్నేహం ప్రేమల వరకు వెళ్లవచ్చు లేదా మధ్యలోనే ఆగిపోవచ్చు. కానీ పలు మీడియాకి ఛానల్స్ కి మాత్రం వారి రిలేషన్ మంచి రేటింగ్ ను ఇస్తుంది. ఒక్క సారి కెమెరా కంట పడితే చాలు డేటింగ్ లు ప్రేమలు అని అనేక ఊహాగానాలు వ్యక్తమవుతాయి.

అయితే చాలా రోజుల తర్వాత సౌత్ బ్యూటీ లక్ష్మీ రాయ్ కి మళ్లీ పాత గాయం గుర్తొచ్చే ఒక సందర్భం వచ్చింది. అమ్మడు అప్పట్లో ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తో ప్రేమాయణాన్ని నడిపినట్లు వార్తలు చాలా వచ్చాయి. 2008లో లక్ష్మీ ఐపీఎల్ - చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది. అయితే అప్పుడు ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న ధోని లక్ష్మితో కాస్త క్లోజ్ గా ఉండేవాడట. దీంతో వారి న్యూస్ మీడియాలలో అప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారు డేటింగ్ కూడా చేసినట్లు అనేక కథనాలు వెలువడ్డాయి.

అయితే ఆ విషయాన్ని కొద్దీ రోజులకే అందరు మర్చిపోయారు.అయితే ప్రస్తుతం లక్ష్మీ రాయ్ తన జూలి 2 ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది. అందులో భాగంగా స్పోట్‌ బోయే అనే వెబ్‌ సైట్‌ తో లైవ్ చాట్ చేసింది. దీంతో లక్ష్మీరాయ్‌ ను ధోనీ గురించి అడుగగా.. 'ఎవరు అతను' అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఆ తర్వాత మళ్లీ ఇక ఈ విషయానికి ఎండ్ పెట్టాల్సిన అవసరం ఉందంటూ.. ఇది చాలా ఓల్డ్ మ్యాటర్.. అనవసరంగా దాని గురించి ఇప్పుడు మాట్లాడుకొని వేస్ట్.. అలాగే అతనికి పెళ్లైంది పిల్లలు ఉన్నారు.. సో.. దాని గురించి వదిలేయడం మంచిదని అమ్మడు తెలివిగా మ్యాటర్ ను ఎండ్ చేసింది.