Begin typing your search above and press return to search.

నా కొడుకు నేను చేసిన సినిమాలను చూడనన్నాడు

By:  Tupaki Desk   |   4 Oct 2020 10:30 PM IST
నా కొడుకు నేను చేసిన సినిమాలను చూడనన్నాడు
X
సీనియర్‌ హీరోయిన్‌ జూహీ చావ్లా బాలీవుడ్‌ తో పాటు హిందీలో పాటు సౌత్‌ లో కూడా చాలా సినిమాల్లో నటించింది. ఇంకా కూడా ఈమె సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ ల్లో నటిస్తుంది. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న ఈమె సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవిస్తున్నట్లుగా తాజా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ అదే ఇంటర్వ్యూలో తన పిల్లలు తన సినిమాలను చూసేందుకు ఇష్టపడటం లేదు అనే ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. నేను నటించిన ఒకటి రెండు సినిమాలు మినహా వారు ఎక్కువగా చూడటం లేదు. నేను రొమాంటిక్‌ గా నటించిన సినిమాలను వారు చూసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని నా కొడుకు అర్జున్‌ స్వయంగా పలు సందర్బాల్లో ఉన్నాడు.

వాళ్ల డాడి ఒకసారి హమ్ హైన్‌ ప్యార్‌ కే సినిమా చూడమంటూ చెప్పిన సమయంలో ఆ సినిమాలో మీరు రొమాంటిక్‌ సీన్స్‌ లో నటించారా అంటూ నన్ను అర్జున్‌ అడిగాడు. అలాంటి సీన్స్‌ లో మిమ్మలను చూడటం ఇష్టం లేదు. ఆ సినిమాలు చూడమని కూతురు జాన్వి మరియు అర్జున్‌ అన్నారంటూ జూహీ చావ్లా పేర్కొంది. పిల్లలు ఇప్పటి వరకు నేను నటించిన రెండు మూడు సినిమాలను మాత్రమే చూశారు. నా సినిమాలను చూడాలంటూ వారిని బలవంత పెట్టాలని నేను అనుకోవడం లేదని జూహీ చావ్లా అభిప్రాయం వ్యక్తం చేసింది.