Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' కి జడ్జి సాబ్ ప్రశంసలు..!
By: Tupaki Desk | 20 April 2021 7:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ''వకీల్ సాబ్''. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు - బోనీ కపూర్ కలిసి నిర్మించారు. 'పింక్' సినిమా రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటించాడు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి ఈ చిత్రంలో ప్రస్తావించారు. అలానే పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని మెయిన్ పాయింట్ పక్కదోవ పట్టకుండా ఈ చిత్రానికి కర్షియల్ హంగులు జోడించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో పీపుల్స్ జడ్జిగా కీర్తి గడించిన మాజీ సుప్రీమ్ కోర్టు జడ్జి జస్టిస్ వి.గోపాలగౌడ తాజాగా 'వకీల్ సాబ్' చిత్రాన్ని చూసి చిత్ర బృందాన్ని అభినందించారు.
''సాధారణంగా సినిమాలు ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం లేదా ఇతిహాసం లేదా కల్పిత కథల నేపథ్యంలో వస్తాయి. కానీ 'దేవదాస్' చిత్రం పవిత్ర ప్రేమని, స్త్రీ పురుష సంబంధాన్ని ఒక నూతన కోణంలో చూపించింది అందుకే అది భారతదేశంలో ఇప్పటికీ ఒక అత్యుత్తమ కావ్యంగా నిలిచిపోయింది. ఇన్నాళ్లకి 'వకీల్ సాబ్' రూపంలో ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలపై న్యాయ పోరాటం ఒక చిత్రంగా వచ్చింది. మహిళల హక్కుల కోసం పోరాటం చేసే యోధుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ నటన అత్యద్భుతం. సాధారణంగా ఇటువంటి సందేశాత్మక చిత్రాలను మాస్ ఫాలోయింగ్ ఉన్న యువ హీరోలు చెయ్యరు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా ప్రతి ఒక్కరి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం మదనపడే వ్యక్తి. ముఖ్యంగా మహిళలకు, రైతులకు, ఆదివాసీలకు, దళితులకు జరిగిన అన్యాయాలపై తిరుగుబాటు చేసిన వ్యక్తి అందుకే వకీల్ సాబ్ పాత్రలో ఆయన నటించలేదు.. జీవించారు. ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ దేశంలో అగ్రనటులే కాకుండా ప్రపంచస్థాయి నటుల నుండి ప్రశంసలు వచ్చాయి, నాకు తెలిసి ఈ అరుదైన గౌరవం చలనచిత్ర రంగంలో ఇప్పటివరకూ ఏ నటుడుకి దక్కలేదు. అందుకే వకీల్ సాబ్ ఒక అత్యుత్తమ చలన చిత్రంగా ప్రపంచంలో చిరస్థాయిగా నిలుస్తుంది" అని జస్టిస్ వి. గోపాలగౌడ ప్రకటనలో పేర్కొన్నారు.