Begin typing your search above and press return to search.

తెల్ల‌వారితే గురువారాన్ని ఆదుకోబోతున్న యంగ్ టైగ‌ర్..!

By:  Tupaki Desk   |   18 March 2021 11:30 AM GMT
తెల్ల‌వారితే గురువారాన్ని ఆదుకోబోతున్న యంగ్ టైగ‌ర్..!
X
కీరవాణి తనయుడు, 'మత్తు వదలరా' ఫేమ్ శ్రీ సింహా కోడూరి నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ''తెల్లవారితే గురువారం''. సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ సినిమాని వారాహి చలన చిత్రం - లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణికాంత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిత్రా శుక్లా - మిషా నారంగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చి 27న ఈ సినిమాని విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 21న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

‘తెల్లవారితే గురువారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ - దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. కీరవాణి - రాజమౌళి కోసమే తారక్ ఈ కార్యక్రమానికి రాబోతున్నాడు. వాస్త‌వానికి ఇలాంటి ఈవెంట్లు సినిమా మీద హైప్ బాగానే తీసుకొస్తున్నాయి కానీ.. ఇలా వ‌చ్చిన బ‌జ్ ఎక్కువ రోజులు ఉండ‌టం లేదు. ఆ త‌రువాత ఈ సినిమా నుంచి వ‌చ్చే పాట‌లు వగైరా ప‌బ్లిసిటీ కంటెంట్ మీద‌నే ఆధార‌ప‌డి ఉంటాయి. మరి ఇప్పుడు యంగ్ టైగ‌ర్ రాక 'తెల్ల‌వారితే గురువారం' చిత్రానికి శుక్ర‌వారం ఓపెనింగ్స్ తెచ్చిపెడుతుందో చూడాలి.

ఇకపోతే ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాళభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రాజీవ్ కనకాల - సత్య - అజయ్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.