Begin typing your search above and press return to search.

బావ‌లే హీరోలు.. బావ‌మ‌రుదులా మ‌జాకానా?

By:  Tupaki Desk   |   16 Aug 2020 9:15 AM IST
బావ‌లే హీరోలు.. బావ‌మ‌రుదులా మ‌జాకానా?
X
బావా బావా ప‌న్నీరు బావ‌ను ప‌ట్టుకు త‌న్నేరు! అంటూ ఆరోజుల్లో మ‌ర‌ద‌ళ్లు బావ‌ల్ని ఆట ప‌ట్టించేవారు. ఆ సంగ‌తి అలా ఉంచితే ఈరోజుల్లో బావ‌లు బావ‌మ‌రుదుల్ని హీరోల్ని చేస్తున్నారు. బావ‌మ‌రుదులే బావ‌ల్ని హీరోలుగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇక‌పైనా కొన‌సాగ‌నుంది.

టాలీవుడ్ లో `బావ`లు హీరోల‌వ్వ‌డం అనే ట్రెండ్ గురించి మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మెగా ఫ్యామిలీ.. ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ.. నంద‌మూరి కుటుంబాల నుంచి బావ‌లు హీరోలుగా మారి అదృష్టం ప‌రీక్షించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బావ‌మ‌రుదుల అండ‌దండ‌తో హీరోలుగా రాజ్య‌మేలేసేందుకు చ‌క‌చ‌కా పావులు కదుపుతున్నారు. ఈ దారిలో కుదుపులు ఎన్ని ఉన్నా కానీ .. ఎలానూ కుటుంబ నేప‌థ్యంతో పాటు ఫ్యాన్స్ అండ ఉంటుంది కాబ‌ట్టి అలా అలా బండి న‌డిపించేస్తున్నారు.

మహేష్ కి సుధీర్ బాబు .. చరణ్ కి కళ్యాణ్ దేవ్ .. రేస్ లో ఉన్నారు. త్వ‌ర‌లోనే వరుణ్ తేజ్‌ బావ‌ చైతన్య కూడా బ‌రిలో దిగిపోతాడు. ఇప్పుడు బావమరుదుల లిస్ట్ లోకి కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది చేరుతున్నాడ‌ట‌. ఎన్టీఆర్ నార్నే వారి అల్లుడు అన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ‌ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్ నార్నె శ్రీనివాస్ కుమార్తె ప్ర‌ణ‌తిని పెళ్లాడాడు. ఇప్పుడు నార్నే శ్రీ‌నివాస్ తనయుడు..ఎన్టీఆర్ బావ‌మ‌రిది నితిన్ హీరోగా సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అంటే ఎన్టీఆర్ తెర‌వెన‌క ఉండి క‌థ న‌డిపిస్తాడ‌న్న‌మాట‌. అయితే న‌ట‌వార‌సులు అయినా .. లేదా బావ‌ల‌ అండ‌తో బ‌రిలో దిగిన వారైనా .. కొన్నాళ్ల త‌ర్వాత ప్ర‌తిభ‌తోనే ఎద‌గాల్సి ఉంటుంది. ఎంట్రీ వ‌ర‌కూ సులువే కానీ ఆ త‌ర్వాత ఎన్నో స‌వాళ్ల‌ను కాంపిటీష‌న్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.