Begin typing your search above and press return to search.
షూటింగ్స్ లేకపోవడంతో టీచర్ గా మారిన ఎన్టీఆర్
By: Tupaki Desk | 17 Jun 2020 10:10 AM GMTమూడు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో స్టార్ హీరోలు అంతా కూడా వారి వారి పిల్లలతో టైం ను స్పెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు అల్లు అర్జున్ లు వారి పిల్లలతో గడుపుతున్న సరదా సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం తన ఇద్దరు కొడుకులతో ఫూర్తి సమయంను గడుపుతున్నాడట. వారు పుట్టినప్పటి నుండి కూడా షూటింగ్స్ తో బిజీ బిజీగా గడిపిన ఎన్టీఆర్ ఎట్టకేలకు వారి కోసం టైం స్పెండ్ చేస్తున్నారు.
తనకున్న కుకింగ్ ప్రతిభతో అమ్మ భార్య పిల్లలకు ఎన్టీఆర్ వండి పెడుతున్నాడట. ఇదే సమయంలో తన ఇద్దరు పిల్లలకు కూడా టీచర్ గా మారిపోయి తెలుగు పాఠాలతో పాటు పలు విషయాలను నేర్పిస్తూ ఉన్నాడట. తన తాత నందమూరి తారక రామారావు సినిమాలను వారితో కలిసి చూస్తూ వారికి తెలుగుపై పట్టు కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాడట. మొత్తానికి ఎన్టీఆర్ ఈ ఫ్రీ టైం ను ఎక్కువగా పిల్లలకు కేటాయిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఈ పరిస్థితి నుండి ఇండస్ట్రీ బయట పడి షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి అంటే ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వగానే లేదా అంతకు ముందే త్రివిక్రమ్ తో సినిమాను చేయబోతున్నాడు. వచ్చే ఏడాదిలో అంతా బాగుంటే ఎన్టీఆర్ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇక త్రివిక్రమ్ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. అలా రెండేళ్ల వరకు అప్పుడే ఎన్టీఆర్ డైరీ ఫుల్ గా అయ్యింది. అందుకే ఈ ఫ్రీ టైం ను ఎన్టీఆర్ పిల్లలకు కేటాయించడం మంచి నిర్ణయంగా అభిమానులు పేర్కొంటున్నారు.