Begin typing your search above and press return to search.

వెకేషన్ మూడ్ లో ఎన్టీఆర్.. ఇంత‌కీ ఏ దేశానికి?

By:  Tupaki Desk   |   20 Nov 2021 4:30 PM GMT
వెకేషన్ మూడ్ లో ఎన్టీఆర్.. ఇంత‌కీ ఏ దేశానికి?
X
ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ షూటింగులతో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌లే RRR పూర్తి చేసి త్రివిక్ర‌మ్ తో మూవీ కోసం ప్రిప‌రేష‌న్ ప్రారంభించ‌నున్నాడు. మ‌రోవైపు ఎవరు మీలో కోటేశ్వరులు? టీవీ షో గేమ్ షోని విజ‌య‌వంతంగా పూర్తి చేసాడు. క‌ఠిన‌మైన షెడ్యూళ్ల‌తో అల‌సిపోయిన అత‌డికి ఇప్పుడు విశ్రాంతి అవ‌స‌రం. అందుకే ఇప్పుడు విదేశీ విహారం రూపంలో విరామం తీసుకున్నాడు.

త‌న‌ కుటుంబంతో స్విట్జర్లాండ్ కు బయలుదేరాడు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయంలో భార్య పిల్లలతో కలిసి కనిపించాడు. తాజాగా టోట‌ల్ ఫ్యామిలీ ఫోటో అంత‌ర్జాలంలో వైరల్ గా మారింది.

వెకేష‌న్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతను RRR ప్రమోషన్స్ లో జాయిన్ అవుతాడు. కొరటాల శివతో తన తదుపరి చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కి బ్రేక్‌ టైమ్‌. ఇది ఎన్నిరోజులు అన్న‌ది కాస్త ఆగితే కానీ తెలీదు. స్పాట్ నుంచి తార‌క్ ఫ్యామిలీ వ‌రుస ఫోటోషూట్ల కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ముఖ్యంగా అభ‌య్ రామ్- భార్గ‌వ్ రామ్ ఈ వెకేష‌న్ లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మార‌నున్నారు.