Begin typing your search above and press return to search.

వడోదర కు వెళ్తున్న ముగ్గురు ఆర్ లు

By:  Tupaki Desk   |   29 March 2019 7:22 AM GMT
వడోదర కు వెళ్తున్న ముగ్గురు ఆర్ లు
X
RRR టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించక ముందు.. తర్వాత అన్నట్టు ఉంది పరిస్థితి. ప్రెస్ మీట్ కు ముందు రెండు రోజులకు ఒక సారైనా కొత్త అప్డేటో.. గాసిప్పో మీడియాలో వచ్చేది. కానీ ప్రెస్ మీట్ తర్వాత ఆ ప్రెస్ మీట్ లో వెల్లడించిన విషయాలపై రెండు రోజులు తీవ్రంగా హడావుడి జరిగింది. తర్వాత RRR పై గాసిప్పుల హంగామా దాదాపుగా తగ్గిపోయింది. అందరూ ఎలెక్షన్ వార్తలతో.. గ్రౌండ్ రిపోర్టులతో బిజీ అయ్యారు.

తాజాగా ఈ RRR గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక అప్డేట్ ఇచ్చాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా "పెద్ద షెడ్యూల్ ప్రారంభం అవుతోంది.. వెళ్తున్నాం. #RRR" అంటూ ట్వీట్ చేశాడు దీంతో పాటు ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఇందులో హైదరాబాద్ నుండి వడోదర(బరోడా) కు మూడు ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. ఇండిగో వారి విమానంలో రామ్ చరణ్.. రాజమౌళి.. తారక్ ముగ్గురూ 29 వ తేదీ ప్రయాణం చేస్తున్నట్టుగా ఉన్న టికెట్స్ అవి.

ఆ జక్కన్న పక్కన చేరి యంగ్ టైగర్ కూడా అలానే తయారయ్యాడు. తనతో పాటు చరణ్.. రాజమౌళి ఉండే ఫోటో పెట్టకుండా మూడు ఫ్లైట్ టికెట్స్ మాత్రమే పెట్టాడు. ఈ ఫోటోకు చాలామంది హ్యాపీ జర్నీ తారక్ అన్నా.. అని విషెస్ చెప్పారు కానీ ఒకరు మాత్రం "సర్..మీరు వడోదరలో ఎక్కడ ఉంటారో కాస్త చెప్పండి. కలవాలి నేను మీకు గుజరాత్ లో ఉన్న పెద్ద పెద్ద ఫ్యాన్ ను" అంటూ అడ్రెస్ అడిగాడు. సినిమా రిలీజ్ కాకముందే ఇలా ఉంటే.. రిలీజ్ అయిన తర్వాత ఈ ఫాలోయింగ్ ఇంకెంతగా పెరుగుతుందో!