Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ.. రాజకీయ సంచలనమా?

By:  Tupaki Desk   |   4 Jan 2021 5:00 PM IST
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ.. రాజకీయ సంచలనమా?
X
జూనియర్ ఎన్‌టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బిజీగా ఉన్నాడు. శరవేగంగా కొనసాగుతున్న ఈ చిత్ర షూటింగ్.. చివరిదశలో ఉంది. వచ్చే దసరాాకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ఈ సినిమా తర్వాత తారక్ నటించబోయే మూవీ త్రివిక్రమ్ డైరెక్షన్లో అన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందన్నది లేటెస్ట్ అప్డేట్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో.. వీరిద్దరూ కలిసి మరో చిత్రం చేయబోతుండడంతో అందరిలోనూ అంచనాలు తారస్థాయికి చేరాయి. ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్ డిస్కషన్ లో ఉంది.

కాగా.. ఈ సినిమాలో నటించేందుకు ఇప్పటికే ముగ్గురు స్టార్ హీరోలు ఓకే చెప్పారని సమాచారం. వారిలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ సీనియర్ యాక్టర్ జయరామ్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో సంజయ్ దత్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడని, ఉపేంద్ర, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తారని అంటున్నారు.

తమదైన ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు ముగ్గురూ ఇందులో నటించడానికి ఓకే చెప్పారంటే.. త్రివిక్రమ్ రూపొందించిన కథలో చాలా బలం ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక, ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండనున్నారని, వారిలో ఒకరిగా జాన్వీ కపూర్‌ ఓకే అయిందని టాక్. మరి, ఇందులో నిజాలెన్ని? పుకార్లెన్ని? అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.