Begin typing your search above and press return to search.
NTRతో కేజీఎఫ్ రేంజు స్టోరీని ప్లాన్ చేశారా?
By: Tupaki Desk | 31 Dec 2020 10:00 AM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓవైపు ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ యాక్షన్ సినిమాలో నటిస్తూనే తదుపరి త్రివిక్రమ్ స్క్రిప్టు పైనా పూర్తి స్థాయిలో దృష్టి సారించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ మాటల మాంత్రికుడు ఎలాంటి కథను వినిపించారు? స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందా? అంటే దానికి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.
నిజానికి దివంగత దర్శకుడు.. తన గురువు అయిన లెజెండ్ బాపు తెరకెక్కించిన క్లాసిక్ మూవీ `మంత్రి గారి వియ్యంకుడు` థీమ్ నే ఎంచుకుని ఒక చక్కని లైన్ ని యంగ్ యమకు త్రివిక్రమ్ వినిపించాడట. కానీ దానికి ఎన్టీఆర్ ససేమిరా అనేయడంతో ఆ తర్వాత కేజీఎఫ్ రేంజులో భారీ యాక్షన్ స్క్రిప్టుని హీరోయిజం ఎలివేట్ చేసే పాత్రను వివరించాడట. కానీ దానికి కూడా తారక్ నో అనేశాడట.
తనకు ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మాత్రమే కావాలని .. కుటుంబ సమేతంగా ఆడియెన్ ని థియేటర్లకు రప్పించాలని.. తెలుగు ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకునే స్క్రిప్టును డిజైన్ చేయాలని సూచించాడట.
నిజానికి త్రివిక్రమ్ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోనూ పని చేయాలన్నది తారక్ ఆలోచన. ఆ మేరకు మైత్రి మూవీ మేకర్స్ తో కమిట్ మెంట్ కూడా ఉంది. అందుకే అతడు త్రివిక్రమ్ కి అలా చెప్పారా? లేదూ మాయావితో ఫ్యామిలీ ఎంటర్ టైనర్లకే గిరాకీ ఉంటుందన్నది అతడి ఆలోచనా? అన్నది పరిశీలిస్తే అవి రెండూ సరైనవేనని అర్థమవుతోంది. మరి అలాంటప్పుడు మంత్రి గారి వియ్యంకుడు లైన్ ని త్రివిక్రమ్ వదిలేస్తారా? అంటే తన శిష్యులకు అవకాశం కల్పించే వీలుంటుంది. స్క్రిప్టు డిజైన్ ని మాత్రం విడిచిపెట్టరన్న ఊహాగానాలు సాగుతున్నాయి.