Begin typing your search above and press return to search.

#NTR30 లో తారక్ గెటప్ అలా ఉంటుందా?

By:  Tupaki Desk   |   24 April 2020 2:20 PM IST
#NTR30 లో తారక్ గెటప్ అలా ఉంటుందా?
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈమధ్యే సంక్రాంతికి విడుదలైన 'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి అల్లు అర్జున్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వడంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఆయనపై పడింది. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోందట.

ఈ సినిమా కథ రాజకీయాల నేపథ్యంలో సాగే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక కార్పోరేట్ కంపెనీకి అధినేతగా కనిపిస్తారని అంటున్నారు. దానికి తగ్గట్టే యంగ్ టైగర్ గెటప్ సూపర్ స్టైలిష్ గా ఉంటుందట. డోంట్ కేర్ యాటిట్యూడ్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడని అంటున్నారు. ఎన్టీఆర్ చాలా తక్కువ సందర్భాలలో ఇలా క్లాస్ పాత్రలలో నటించారు. మరి గురూజీ ఎన్టీఆర్ ను ఎలా చూపించబోతున్నారనేది నిజంగానే ఆసక్తికరం.

ఎన్టీఆర్ ప్రస్తుతం 'RRR' లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే #NTR30 పట్టాలెక్కుతుంది. 'అరవింద సమేత' తర్వాత త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది. పూజా హెగ్డే ను ఈ సినిమా హీరోయిన్ గా అనుకుంటున్నారట. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.