Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ రేంజ్ కి 700 జరిమానా
By: Tupaki Desk | 6 April 2016 10:47 PM ISTఇప్పుడు హైద్రాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల హంగామా ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. ఎవరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి స్టార్స్ వరకూ అందరినీ ఒకేరకంగా రకంగా చూస్తూ.. రూల్స్ గురించి క్లాస్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడీ ఎఫెక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కూడా పడింది.
హైద్రాబాద్ అమీర్ పేటలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కారు అటువైపుగా వచ్చింది. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. నిబంధనల ప్రకారం కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండకూడదు. అమీర్ పేటలోని సారథి స్టుడియో వైపు వెళ్తున్న ఏపీ 37ఏఎక్స్ 9999 నంబర్ గల రేంజ్ రోవర్ కారుకు నల్ల స్టిక్కర్లు ఉండటంతో పోలీసులు ఆపేశారు. రూల్స్ ప్రకారం 700 రూపాయల జరిమానా విధించారు.
ఈ కార్ ను ఎన్టీఆర్ ఉపయోగిస్తాడు కానీ.. ఈ రేంజ్ రోవర్ తన పేరుపై లేదు. మామ గారైన నార్నే శ్రీనివాసరావు ఈ కారును ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. లక్ష్మీ ప్రణతితో ఎంగేజ్ మెంట్ సమయంలో.. ఎన్టీఆర్ కి అందిన కాస్ట్లీ గిఫ్ట్ ఈ కార్.