Begin typing your search above and press return to search.

యంగ్ టైగర్ చేయలేనని చెప్పాడట!

By:  Tupaki Desk   |   18 March 2019 10:23 AM GMT
యంగ్ టైగర్ చేయలేనని చెప్పాడట!
X
కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సాధించింది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు మూడో సీజన్ ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా ఎవరు ఉంటారనే విషయంలో చాలా రోజుల నుండి చర్చలు సాగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ సీజన్ కు వ్యాఖ్యాతగా మరోసారి వ్యవహరించేందుకు రెడీగా ఉన్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మూడో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించలేనని నిర్వాహకులకు తెలిపాడట. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'RRR' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను వచ్చే ఏడాది జనవరిలోపే పూర్తి చేయాలని 'RRR' టీమ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఏప్రిల్ నుంచి బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేయడం జరిగిందట. దీంతో ఎన్టీఆర్ కు బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించే సమయం ఉండదనే ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వాహకులకు తన నిర్ణయాన్ని తెలిపాడట.

బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. కానీ 'అరవింద సమేత' షూటింగ్ కారణంగా రెండో సీజన్ కు హోస్ట్ గా చేయలేదు. ఎన్టీఆర్ స్థానంలో నాని హోస్ట్ గా వచ్చాడు. నాని మూడో సీజన్ కు 'నో' చెప్పడంతో బిగ్ బాస్ నిర్వాహకులు మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా నో చెప్పాడు కాబట్టి మరో స్టార్ హీరోను వెతకాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఎవరు బిగ్ బాస్ 3 హోస్ట్ గా వస్తారో వేచి చూడాలి.