Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత జూనియర్ మూవీ ?

By:  Tupaki Desk   |   22 May 2019 11:51 AM IST
ఆర్ ఆర్ ఆర్ తర్వాత జూనియర్ మూవీ ?
X
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెరమీద చూడాలంటే ఇంకో ఏడాది పైగానే వేచి చూడాలి. చెర్రికి గాయం కాకపోయి ఉంటే కీలకమైన రెండో షెడ్యూల్ ఈపాటికే ఓ కొలిక్కి వచ్చేది. తనతో సినిమా చేస్తున్నప్పుడు ఇంకే ప్రాజెక్ట్ గురించి ఆలోచించే అవకాశం ఇవ్వని జక్కన్న క్యాంప్ లో ఇద్దరు స్టార్స్ బ్లాక్ అయిపోవడం 2019లో ఆయా ఫ్యాన్స్ కి లోటుగానే మిగలనుంది.

ఇకపోతే మొన్న తారక్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. అయితే నాన్న హరికృష్ణ కాలం చేసి ఏడాది దాటని కారణంగా ఎలాంటి సంబరాలకు చేసుకోకుండా సింపుల్ గా ఉన్నాడు. కాని అభిమానుల ఒత్తిడి మేరకు వాళ్ళతో కాసేపు వాళ్ళతో గడిపిన తారక్ ఓ ముచ్చట షేర్ చేసుకున్నాడట. దాని ప్రకారం ఆర్ ఆర్ ఆర్ తర్వాత్ మళ్ళి త్రివిక్రమ్ తోనే సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పాడట.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో షూటింగ్ లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ వచ్చే సంక్రాంతికి ఫ్రీ అవుతాడు. ఆలోపు ఆర్ ఆర్ ఆర్ దాదాపు ఫినిషింగ్ స్టేజి లో ఉంటుంది. కాని మాటల మాంత్రికుడు ఆల్రెడీ వెంకటేష్ కు ఓ కమిట్మెంట్ ఇచ్చాడు. అది పూర్తి చేయాల్సి ఉంది. గత ఏడాది వెంకీ బర్త్ డే సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన కూడా యాడ్ రూపంలో ఇచ్చారు.

మరోవైపు మహేష్ బాబు కూడా తనకో సినిమా చేయమనే ప్రతిపాదన పంపాడని న్యూస్ ఉంది. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ ఎవరి వైపు మొగ్గు చూపుతాడు అసలు ఎవరికి సూటయ్యే కథ తన దగ్గర ఉందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి