Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ నోట డీజే టిల్లు మాట
By: Tupaki Desk | 22 March 2022 7:00 AM ISTఈ మధ్య కొత్త తరహా ఆలోచనలతో నేటివిటీకి దగ్గరగా వస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సాధిస్తున్నాయి. అంతే కాకుండా స్టార్ హీరోల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలైన చిత్రం `డీజే టిల్లు`. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించాడు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటన్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం నిర్మాతకు ఊహించిన స్థాయిలో లాభాల్ని తెచ్చిపెట్టింది. ఈ మూవీ సాధించిన వసూళ్లపై ట్రేడ్ వర్గాలే విస్మయాన్ని వ్యక్తం చేశాయంటే ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని సాధించిందో అర్థం చేసుకోవచ్చు. టైటిల్ సాంగ్ తో పాటు సినిమా అంతా తెలంగాణ స్లాంగ్ లో సాగడం, హీరో క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేసిన తీరు, డైలాగ్స్, ఫన్నీ సన్నివేశాలు సినిమాని సూపర్ హిట్ అయ్యేలా చేశాయి.
హీరో సిద్దు జొన్నలగడ్డ ఈ చిత్రంలో నటించడమే కాకుండా రచయితగా తన వంతు పాత్రని కూడా పోషించాడు. విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తే అతనితో కలిసి రచనా సహకారం అందించాడు. ఈ మూవీ అతని కెరీర్ కి ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంతగా అతనికి మంచి పేరుతో పాటు హీరోగా క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇటీవల ఆహా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
దీంతో ఈ మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో ఎన్టీఆర్ ఈ మూవీ డైలాగ్ ని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. `ఆర్ ఆర్ ఆర్ ` మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో సందడికి రెడీ అవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఆప్ ది రికార్డ్ అంటూ తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ `అట్లుంటది మనతోని` అంటూ డీజే టిల్లు డైలాగ్ చెప్పడం ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది.