Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడా?

By:  Tupaki Desk   |   1 Jun 2017 5:09 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడా?
X
రెమ్యూనరేషన్స్ విషయంలో పలువురు అగ్రశ్రేణి హీరోలపై రకరకాల న్యూస్ వస్తుంటాయి. కానీ స్టార్ హీరో అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అన్నేసి కోట్ల పారితోషికం పుచ్చుకున్నాడు.. ఇంత మొత్తం అందుకున్నాడు అనే న్యూస్ పెద్దగా కనిపించదు. ఈ విషయంలో ఎన్టీఆర్ అంతగా పట్టింపు ఉండదని చెబుతారు సన్నిహితులు.

కానీ సినిమాల విషయంలో ఎప్పుడూ పారితోషికం విషయంలో రాని న్యూస్.. స్మాల్ స్క్రీన్ అరంగేట్రంపై వచ్చేశాయి. స్టార్ మా ఛానల్ కోసం బిగ్ బాస్ షో తెలుగు వెర్షన్ చేసేందుకు టాలీవుడ్ బాద్ షా అంగీకరించాడని.. ఇందుకోసం పెద్ద మొత్తంలో.. అంటే 8-10 కోట్ల మొత్తం పుచ్చుకోనున్నాడని రూమర్స్ వచ్చేశాయి. ఈ న్యూస్ ఎన్టీఆర్ ను బాగా హర్ట్ చేసిందని తెలుస్తోంది. బిగ్ బాస్ షో చేసేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నా.. ఇప్పటివరకూ రెమ్యూనరేషన్ కు సంబంధించిన అగ్రిమెంట్స్ ఏవీ జరగలేదట. అది కూడా.. మీడియాలో వార్తలు వస్తున్న స్థాయిలో పుచ్చుకునే అవకాశాలు లేవని అంటున్నారు.

ఈ అనవసరమైన హైప్ కారణంగా.. తన క్లీన్ ఇమేజ్ కు నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నాడట జూనియర్. అవసరమైతే సినిమా రిలీజ్ కోసం నిర్మాతకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉండే ఎన్టీఆర్ పై.. ఇలాంటి భారీ రెమ్యూనరేషన్ వదంతులు డబ్బు మనిషి అనే స్టాంప్ ను వేస్తున్నాయి. అందుకే యంగ్ టైగర్ హర్ట్ అయ్యాడన్నది సన్నిహితుల మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/