Begin typing your search above and press return to search.

బింబిసార' కోసం ఎన్టీఆర్‌ అంతకు మించి..!

By:  Tupaki Desk   |   11 Jun 2021 9:30 AM GMT
బింబిసార కోసం ఎన్టీఆర్‌ అంతకు మించి..!
X
ఒకప్పటితో పోల్చితే గత కొంత కాలంగా నందమూరి బ్రదర్స్‌ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్‌ ల మద్య అనుబంధం మరింతగా పెరిగినట్లుగా అనిపిస్తుంది. గతంలోనూ ఇద్దరు సన్నిహితంగా ఉన్నా బయటకు మాత్రం వారి సన్నిహిత్యం కనిపించక పోయేది. కాని వీరిద్దరు ఒకరి సినిమాల్లో మరొకరి ఇన్వాల్వ్‌ మెంట్‌ తో ఈమద్య మరింత క్లోజ్ అయినట్లుగా అభిమానులకు కనిపిస్తున్నారు. కళ్యాణ్ రామ్‌ ను హీరోగా సక్సెస్‌ లతో నిలబెట్టేందుకు ఎన్టీఆర్‌ తనకు సాధ్యం అయినంత వరకు సాయంగా నిలుస్తున్నాడు. అంతే కాకుండా తన ప్రతి సినిమా నిర్మాణ వ్యవహారంలో ముందు ముందు కళ్యాణ్ రామ్‌ ను ఇన్వాల్వ్‌ చేయబోతున్నట్లుగా కొరటాల శివ సినిమా ద్వారా చెప్పకనే చెప్పాడు.

ఇక కళ్యాణ్ రామ్‌ ప్రస్తుతం 'బింబిసార' అనే భారీ పౌరాణిక చిత్రంను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం కళ్యాణ్‌ రామ్‌ అన్ని రకాలుగా చాలా కష్టపడుతున్నాడు. అందుకే అన్న కోసం ఎన్టీఆర్‌ తనవంతు సహకారంను అందించేందుకు ముందుకు వస్తున్నాడట. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్టీఆర్‌ బింబిసార స్క్రిప్ట్‌ ను ఒకటికి రెండు సార్లు విని పలు మార్పులు చేర్పులు సూచించాడట. దానికి తోడు సినిమాలోని పలు సన్నివేశాల విషయంలో కూడా ఎన్టీఆర్‌ సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు.

సినిమాకు సంబంధించి మరో కీలక విషయం ఏంటీ అంటే ఈ ఈసినిమా కోసం ఎన్టీఆర్‌ వాయిస్ ఓవర్‌ ఇవ్వబోతున్నాడట. సినిమా ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ తో మొదలు కాబోతుందట. అలా మొదలు అయిన సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్ కు తీసుకు వెళ్లబోతుందట. సినిమా మద్య మద్యలో కూడా ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఉంటుందని అంటున్నారు. ఇక విడుదల సమయంలో సహజంగానే ఎన్టీఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. మొత్తానికి బింబిసార కోసం ఎన్టీఆర్‌ అంతకు మించి అన్నట్లుగా తన సహకారంను అందించబోతున్నాడు.