Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ మాటలు.. టిల్లు గాడికి అవార్డు

By:  Tupaki Desk   |   29 March 2022 1:30 AM GMT
ఎన్టీఆర్‌ మాటలు.. టిల్లు గాడికి అవార్డు
X
సిద్దు జొన్నలగడ్డ.. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. ఇన్నాళ్లు కొంత మంది వరకే తెలిసిన సిద్దు జొన్నలగడ్డ తాజాగా విడుదల అయిన డీజే టిల్లు సినిమాతో ప్రతి ఒక్క యూత్‌ ఆడియన్ కు చేరువ అయ్యాడు అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున డీజే టిల్లు సినిమాకు సంబంధించిన సందడి ఇంకా కూడా కనిపిస్తుంది. థియేటర్ లో మరియు ఓటీటీ లో ఇలా ప్రతి చోట కూడా డీజే టిల్లు సినిమా సూపర్‌ హిట్‌ గా నిలిచింది.

ఇటీవల ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డీజే టిల్లు సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో సిద్దు జొన్నల గడ్డ నటనపై ప్రశంసలు కురిపించాడు. టీవీ ద్వారా పరిచయం అయ్యి ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌ పై మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. సిద్దు నటనకు నేను ఫిదా అయ్యాను అన్నట్లుగా ఎన్టీఆర్‌ వ్యాఖ్యలు చేశాడు.

ఎన్టీఆర్‌ వ్యాఖ్యలను సోషల్‌ మీడియా ద్వారా సిద్దు జొన్నల గడ్డ షేర్‌ చేశాడు. ఎన్టీఆర్‌ అన్నా... నువ్వు నాకు నీ మాటలతో మొదటి అవార్డును ఇచ్చావు. చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో స్పందించేందుకు మాటలు రావడం లేదు. ప్రస్తుతం సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను.. మీ మాటలు మరింత విశ్వాసంను పెంచాయి అంటూ ఎన్టీఆర్‌ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాడు.

సిద్దు ఇప్పటి వరకు నటించిన ప్రతి సినిమాలో కూడా ది బెస్ట్‌ ను ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎన్నో సినిమాల్లో ఆకట్టుకునే నటనతో మెప్పించాడు. ఇప్పుడు డీజే టిల్లు తో సిద్దుకు రావాల్సిన గుర్తింపు వచ్చింది. లక్ వల్లే ఇది సాధ్యం అయ్యింది అనే వారు కూడా లేక పోలేదు. కాని ఆయన ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో ఆయన గత సినిమాలను కూడా చూస్తే అర్థం అవుతుంది. రాబోయే రోజుల్లో సిద్దు జొన్నలగడ్డ ఖచ్చితంగా టాలీవుడ్‌ మరో రౌడీ స్టార్‌ అంటున్నారు.

డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. స్వతహాగా రచయిత అయిన సిద్దు మంచి కథలతో పాటు.. ఆ కథలకు తగ్గ పాత్రల డైలాగ్స్ ను కూడా సిద్దు అబ్బుర పర్చే విధంగా రాయడం లో దిట్ట అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట సిద్దు జొన్నల గడ్డ క్రేజ్‌ ఈమద్య కాలంలో అమాంతం పెరిగింది. ఎన్టీఆర్‌ ప్రశంసలతో ఆయన స్థాయి మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు.