Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: ఖరీదైన లగ్జరీ కారు ముందు ఎన్టీఆర్ - శ్రీకాంత్..!

By:  Tupaki Desk   |   25 Aug 2021 5:47 AM GMT
వైరల్ పిక్: ఖరీదైన లగ్జరీ కారు ముందు ఎన్టీఆర్ - శ్రీకాంత్..!
X
టాలీవుడ్ లో చాలామంది హీరో హీరోయిన్లకు లగ్జరీ కార్స్ పై మక్కువ చూపిస్తుంటారు. మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన కారు నచ్చిందంటే ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా దానిని కొనుగోలు చేస్తుంటారు. ఖరీదైన కార్లు మెయింటెన్ చేసే హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. ఇప్పటికే లగ్జరీ ఫీచర్స్‌ తో ఉన్న అనేక కాస్ట్లీ కార్లను బైక్స్ ను తారక్ ఇష్టంగా తెప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇటాలియన్ లగ్జరీ కారుగా పేరొందిన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫిటే క్యాప్సుల్‌ ని ఎన్టీఆర్ ఇంపోర్ట్ చేసుకున్నారు.

తారక్ కొనుగోలు చేసిన లగ్జరీ కారుకు సంబంధించిన విశేషాలు ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ కు చెందిన ఓ ఇంపోర్ట్ కంపెనీ ద్వారా బుక్ చేసుకున్న లంబోర్ఘిని ఉరుస్ కారు ఎన్టీఆర్ ఇంటి ముందుకు వచ్చి హుందాగా నిలుచుంది. తాజాగా ఎన్టీఆర్ కారు ముందు నిల్చొని ఉన్న ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎన్టీఆర్ తో పాటుగా సీనియర్ నటుడు శ్రీకాంత్, మరొక స్నేహితుడు కనిపిస్తున్నారు. ఇది కారు డెలివరీ అయిన సందర్భంగా తీసుకున్న ఫోటో అయ్యుండొచ్చు.

ఇండియాలో లంబోర్ఘిని ఉరుస్ కారు కొన్న ఫస్ట్ హీరోగా ఎన్టీఆర్ నిలిచారనే వార్త సైతం ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యింది. దీని విలువ దాదాపు ఐదు కోట్ల వరకు ఉంటుందట. ఒకప్పుడు హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ కొన్న ఫస్ట్ హీరోగా తారక్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లగ్జరీ కారు విషయంలోనూ తారక్ ఫస్ట్ అంటూ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కారు చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఎన్టీఆర్ లగ్జరీ కార్స్ మెయింటెన్ చేయడంలోనే కాదు, వాటికి ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవడంపై కూడా ఆసక్తి చూపిస్తుంటారు. తారక్ దగ్గర ఉన్న కార్లు బైకులకు ఎక్కువగా '9999' అనే నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాస్ట్లీ లంబోర్ఘిని ఉరుస్ కారుకు కూడా అదే నెంబర్ తీసుకుంటారేమో చూడాలి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' అనే ఫిక్షనల్ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నారు. అలానే కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈలోపు జెమినీ టీవీలో ప్రసారం అయ్యే 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో కు హోస్టుగా వ్యవహరిస్తున్నారు.