Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు జూనియర్ చిక్కు!

By:  Tupaki Desk   |   15 Dec 2018 7:00 PM IST
ఎన్టీఆర్ కు జూనియర్ చిక్కు!
X
ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒకరకంగా ఆసక్తి రేపుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు కీలక సమయం వచ్చేసింది. ఎల్లుండి ట్రైలర్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తుండగా ఆపై మరో నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో జరిగే ఆడియో రిలీజ్ కోసం అంతకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధపడుతున్నారు. నిమ్మకూరు సెంటిమెంట్ పరంగా ఎమోషనల్ గా ప్రత్యేకమైన అటాచ్మెంట్ ఉన్న చోటు కావడంతో నందమూరి కుటుంబం మొత్తం హాజరవుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం అందిందా లేదా అనే విషయం మాత్రం పెద్ద చర్చకే దారి తీస్తోంది. ఒకవర్గం కళ్యాణ్ రామ్ ఎలాగూ ఇందులో నటించాడు కాబట్టి అతనితో పాటు తమ్ముడైన తారక్ ను కూడా కలిపే ఆహ్వానించి ఉంటారని అంటున్నారు. మరో వర్గం దీనికి భిన్నంగా హరికృష్ణ మరణం ముందు వరకు జూనియర్ తో చాలా గ్యాప్ మైంటైన్ చేసిన బాలయ్య ఇప్పుడు మొత్తం తగ్గించుకుంటాడా అనే విషయంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా తారక్ వస్తేనే ఎన్టీఆర్ కు ప్లస్ అవుతుంది. ఎలాంటి నెగటివ్ మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్లకుండా ఆపుతుంది. ఎలాగూ అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ మీట్ కు బాలకృష్ణ వచ్చాడు కాబట్టి ఫోన్ చేసినా చాలు తారక్ నిమ్మకూరుకు ప్రయాణమవుతాడనేది నందమూరి ఫ్యాన్స్ మాట. అది జరిగినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ రాకపోతేనే సోషల్ మీడియాకు మంచి ఉప్పందించినట్టు అవుతుంది. ఎలాగూ దీని వెనుక చంద్రబాబు నాయుడు సలహాలు సూచనలు ఉన్నాయి కాబట్టి తారక్ ను పిలవమనే చెబుతాడు. సో హాజరు విషయంలో పెద్దగా అనుమానం అవసరం లేదు. లేదూ రాకుండా కారణం ఏది చెప్పినా అది కన్విన్సింగ్ గా లేకపోతే మాత్రం చిక్కులు తప్పవు.