Begin typing your search above and press return to search.
కెవ్వు కేక పాట కు నందమూరి హీరో స్టెప్పులు
By: Tupaki Desk | 31 Dec 2019 11:29 AM ISTమెగా హీరోలు.. నందమూరి హీరోలు తెర వెనక ఎంత ఫ్రెండ్లీగా వున్నా.. తెర ముందు వీరి ఫ్యాన్స్ మధ్య రైవర్లీ కొన్నేళ్లుగా అలానే నడుస్తోంది. అయితే ఒక మెగా హీరో పాటకు నందమూరి హీరో డ్యాన్స్ చేస్తే ఎలా వుంటుంది?.. ఫ్యాన్స్ రియాక్షన్ మాటేమిటి? అంటే... అయితే ఇలాంటి అరుదైన సీన్ ఒకటి బయట పడింది. మెగా హీరో పాట కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియా ల్లో వైరల్ అవుతోంది.
కొన్ని నెలల క్రితం జైపూర్ లో రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం జగపతిబాబు అన్న కూతురుతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీకి చెందిన క్రేజీ స్టార్స్ అంతా పాల్గొని హంగామా చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో భారీ హంగులు ఆర్భాటాలతో కార్తికేయ వివాహ వేడుక జరిగింది. ఇందులో పాల్గొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `గబ్బర్‌సింగ్` సినిమాలోని `కెవ్వు కేక ..` పాటకు స్టెప్పులేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆ వీడియో తాజాగా బయటికి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ స్టెప్పులేస్తుంటే ప్రభాస్ కూడా అతనికి జత చేరి రచ్చ చేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి `ఆర్.ఆర్.ఆర్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో వుంది. హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలు సృష్టించనుందో చూడాలి.