Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ 31 పై వస్తున్న న్యూస్ నిజమవ్వాలని కోరుకుంటున్న ఫ్యాన్స్...!

By:  Tupaki Desk   |   2 May 2020 2:00 PM IST
ఎన్టీఆర్ 31 పై వస్తున్న న్యూస్ నిజమవ్వాలని కోరుకుంటున్న ఫ్యాన్స్...!
X
నందమూరి నటవారసుడు ఎన్టీఆర్ గత కోనేళ్ళుగా బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తూ వస్తున్నాడు. రొటీన్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ మూస ధోరణిలో వస్తున్న తారక్ ని 'టెంపర్' సినిమా మార్చేసింది అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ లో కేర్ తీసుకుంటూ వస్తున్నాడు జూనియర్. 'టెంపర్‌'తో మొదలు పెట్టిన జైత్రయాత్ర 'నాన్నకు ప్రేమతో' 'జనతా గ్యారేజ్' 'జై లవకుశ' 'అరవింద సమేత వీర రాఘవ' వరకు కొనసాగించింది. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇతర భారతీయ భాషల్లో కూడా భారీగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తారక్ తెలుగు హీరో మాత్రమే.. కానీ రాజమౌళి ట్రిపుల్ ఆర్ తర్వాత ఖచ్చితంగా ఈయన నేషనల్ వైడ్ స్టార్ హీరో అయిపోతాడు. రాజమౌళి సినిమా ఎఫెక్ట్ అలా ఉంటుంది మరి.

'బాహుబలి' తర్వాత అందరూ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించాలని ఉత్సాహపడుతున్నారు. అందుకోసం తమ ప్రాజెక్టులను ఆ దిశగా నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వర్కవుట్ అయ్యే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అవకాసం వస్తే ఇతర భాషల భారీ చిత్రాల్లోనూ నటించటానికి ఉత్సాహం చూపిస్తుస్తున్నారు. మార్కెట్ పెరిగేందుకు ఏయే మార్గాలు ఉన్నాయో అవన్నీ అన్వేషిస్తున్నారు. ఎన్టీఆర్ తన వరుస సినిమాలను పాన్ ఇండియా లెవల్‌ లోనే ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ రీత్యా తమిళ, కన్నడ పరిశ్రమలలో టాప్ డైరెక్టర్స్ గా ఉన్నవారు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కమిట్ అయ్యారు. కొద్దిరోజులలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలే హస్తిన'కు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

ఈ రెండు సినిమాలు లైన్‌లో ఉండగానే ఎన్టీఆర్ హీరోగా చేయ‌బోయే 31వ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అయితే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అనౌన్స్ చేసిన‌ ఎన్టీఆర్ 30 ఇంకా ప్రారంభం కానే లేదు అప్ప‌డే తార‌క్ 31వ సినిమానా అనే సందేహం రాక‌మాన‌దు. ఎన్టీఆర్ బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ఈ వార్త సారాంశం. భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ తో ఓ భారీ పీరియాడికల్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే సౌత్ లోనే భారీ ఫాలోయింగ్ కలిగిన హీరోగా ఎన్టీఆర్ అవతరించే అవకాశం ఉంది. ఇలా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోతున్నారనే వార్త ఇప్పుడు ఆయన అభిమానులను ఆనందపరవశంలో ముంచెత్తుతోంది. ఈ న్యూస్ నిజమైతే బాగుండు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో రణ్‌ వీర్ సింగ్ విలన్ రోల్ పోషిస్తున్నాడంటూ వార్త చక్కర్లు కొడుతున్నది. చూడాలి మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ న్యూస్ నిజమై కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి.