Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ లా బాలీవుడ్ డైరెక్ట‌ర్ తో ఎన్టీఆర్ బిగ్ డీల్?

By:  Tupaki Desk   |   7 Sept 2020 10:15 AM IST
ప్ర‌భాస్ లా బాలీవుడ్ డైరెక్ట‌ర్ తో ఎన్టీఆర్ బిగ్ డీల్?
X
డార్లింగ్ ప్ర‌భాస్ కి బాహుబ‌లి స్టార్ గా బాలీవుడ్ లో ఉన్న క్రేజు గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. హిందీ బెల్టులో సౌత్ ఛాలెంజ‌ర్ గా వెలిగిపోతున్నాడు. ఖాన్ లు క‌పూర్ల‌ను ఆరాధించిన అభిమానులే మ‌న డార్లింగ్ గురించి ఆరా తీస్తున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ప్ర‌భాస్ కి `సాహో` చిత్రం వ‌ల్ల హిందీ బెల్టులో క్రేజు పెరిగిందే కానీ త‌గ్గ‌లేదు. మొన్న‌టికి మొన్న బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ తో `ఆదిపురుష్ 3డి` ప్ర‌కటించడంతో మ‌రోసారి ప్ర‌భాస్ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోయింది. జాతీయ స్థాయిలో డార్లింగ్ ఇమేజ్ అంత‌కంత‌కు పెంచే ప్ర‌య‌త్నం సాగుతోంది.

అదంతా అటుంచితే.. ఇప్పుడు ప్ర‌భాస్ ని ఛేజ్ చేసేందుకు టాలీవుడ్ అగ్ర హీరోలు చేస్తున్న ప్ర‌య‌త్నాలు హాట్ టాపిక్ గా మారాయి. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ ల‌ను హిందీ బెల్టులో ఫేమ‌స్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. బాహుబ‌లి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఆ ఇద్ద‌రినీ ఈ మూవీలో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులుగా రియాలిటీ మిక్స్ చేసిన‌ ఫిక్ష‌న‌ల్ పాత్ర‌లతో యూనిక్ గా చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ మూవీ త‌ర్వాత ఎన్టీఆర్ `కేజీఎఫ్` లాంటి పాన్ ఇండియా సినిమాతో హిందీ బెల్టులో ఫేమ‌స్ అయిన ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నాడు. ఆ త‌ర్వాత ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో ప‌ని చేసేందుకు తెలివైన ఎత్తుగ‌డ వేయడం చూస్తుంటే తార‌క్ ఏ రేంజులో ప్లాన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇప్ప‌టికి రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్‌.ఆర్.ఆర్ కాకుండా.. త్రివిక్రమ్.. ప్ర‌శాంత్ నీల్ సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు హిందీ డైరెక్ట‌ర్ తో ప్రాజెక్టును ఖాయం చేసుకోనున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది కూడా భారీ పాన్-ఇండియన్ రేంజ్ లో ఉంటుంద‌ని తెలిసింది. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ దర్శకుడితో ప్ర‌స్తుతం ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నాడు. ఈ చిత్రంలో అత‌డు కిక్ బాక్స‌ర్ గా న‌టించ‌నున్నాడని తెలుస్తోంది. దీనికోసం కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ కి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తార‌క్ స్వ‌యంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.