Begin typing your search above and press return to search.

ఆ సీజన్ పై కన్నేసిన ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   28 Jan 2020 10:38 AM GMT
ఆ సీజన్ పై కన్నేసిన ఎన్టీఆర్
X
ఏడాదిలో సినిమాలకంటూ మూడు సీజన్స్ ఉంటాయి. సంక్రాంతి , సమ్మర్ , దసరా ఈ మూడు సీజన్స్ లో బడా సినిమాలు కొన్ని నెలల ముందే లాక్ అయిపోతాయి. అయితే అందులో ప్రథమమైనది సంక్రాంతి సీజన్. అందుకే జనవరిలో సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అయ్యే సినిమాలకు ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుంది. హీరోలు , డైరెక్టర్స్ , నిర్మాతలు ఇలా ముగ్గురు ఏమాత్రం గ్యాప్ దొరికినా సంక్రాంతికి ఫిక్సయిపోతారు.

గతేడాది 'F2'వంద కోట్లు కొల్లగొట్టగా ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమా ఏకంగా నాన్ బాహుబలి రికార్డు కొట్టేసింది. అందుకే ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి పై కొందరు బడా హీరోలు కన్నేశారు. అందులో ఈసారి తారక్ కూడా ఉన్నాడు. అవును ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రం తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ను సంక్రాంతి కానుక గా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. తారక్ కూడా నెక్స్ట్ సంక్రాంతి కి తన సినిమా అంటూ ఫిక్సయిపోయాడు. త్రివిక్రమ్ కూడా అదే ప్రణాళిక తో షూటింగ్ డేస్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

అయితే ఈ ఏడాది ఏ మాత్రం అటు ఇటు అయినా ఆర్.ఆర్.ఆర్ కూడా సంక్రాంతి కే వచ్చే చాన్స్ ఉంది. ఇప్పటి వరకూ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు. పైగా షూటింగ్ ఇంకా ఓ మూడు నెలలు పైనే ఉంటుందని అంటున్నారు. ఆ ప్లానింగ్ లో ఏ మాత్రం మార్పు వచ్చిన సినిమా కి ఒకే ఆప్షన్ సంక్రాంతి. మరి ఆ సినిమా డేట్ అంటూ వచ్చాకే మిగతావన్నీ ఫిక్సవుతాయి.