Begin typing your search above and press return to search.

తన బ్రాండ్ ను బిగ్‌ బాస్ ఫినాలే స్టేజ్ పై ప్రమోట్‌ చేసిన జూ.బంగార్రాజు

By:  Tupaki Desk   |   20 Dec 2021 5:06 AM GMT
తన బ్రాండ్ ను బిగ్‌ బాస్ ఫినాలే స్టేజ్ పై ప్రమోట్‌ చేసిన జూ.బంగార్రాజు
X
నాగ చైతన్య గురించి ఈమద్య కాలంలో మీడియాలో ప్రథానంగా వార్తలు వస్తున్నాయి. ఆయన సినిమాల వల్ల కాకుండా వ్యక్తిగత జీవితం వల్ల ఆయన గురించి మీడియాలో రెగ్యులర్ గా నిలుస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా కూడా చివరకు అక్కడికి ముడి పెట్టి కొందరు కథనాలు రాస్తున్నారు. మళ్లీ ఆయన షూటింగ్‌ లతో బిజీ అయ్యాడు.. సాదారణ లైఫ్ స్టైల్‌ కు మారాడు. ఈ సమయంలోనే బిగ్‌ బాస్ సీజన్‌ 5 ఫినాలే ఎపిసోడ్‌ స్టేజ్‌ పై సందడి చేశాడు. కేవలం స్టేజ్ పైనే కాకుండా హౌస్‌ లోకి వెళ్లి టాప్ 3 ని టెమ్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మొత్తంగా బిగ్ బాస్‌ లో నాగ చైతన్య కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకు నాగ చైతన్య బిగ్ బాస్ స్టేజ్ పై ఎందుకు నిల్చున్నాడు అంటే ఆయన ప్రమోటర్ గా వ్యవహరిస్తున్న ప్రో కబడ్డీ ని ప్రమోట్‌ చేయడం కోసం వెళ్లాడు.

బిగ్ బాస్ స్టేజ్ పై ప్రో కబడ్డీ లీగ్‌ స్టార్ స్పోర్ట్స్ తెలుగు లో ప్రసారం కాబోతుందని.. ప్రతి ఒక్కరు చూడాలంటూ కోరాడు. తన సపోర్ట్‌ ఖచ్చితంగా తెలుగు టైటన్స్ కి ఉంటుంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. మొదటి నుండి తనకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇలా ప్రో కబడ్డీ కి అంబాసిడర్ గా వ్యవహరించాల్సిందిగా కోరితే ఒప్పుకున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. స్టేజ్ పై తండ్రి నాగార్జునతో సరదాగా ముచ్చటించాడు. అదే సమయంలో తండ్రికి మరియు ప్రేక్షకులకు ఒక సర్‌ ప్రైజ్ అంటూ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 ఏవీని విడుదల చేయడం జరిగింది. నాగార్జున ఆ ఏవీకి చాలా ముచ్చటపడిపోయాడు. తనను తాను అక్కడ చూసుకుని సంతోషంతో మొహం వెలిగి పోయింది.

ప్రస్తుతం నాగ చైతన్య ప్రో కబడ్డీ కి ప్రమోటర్ గా వ్యవహరిస్తూనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తండ్రి నాగార్జునతో కలిసి నటించన బంగార్రాజు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతికి ఆ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో థ్యాంక్యూ సినిమాను కూడా చైతూ చేశాడు. మొత్తానికి వచ్చే ఏడాది బంగార్రాజు తో పాటు థ్యాంక్యూ మరియు బాలీవుడ్‌ అమీర్ ఖాన్ మూవీ లాల్‌ సింగ్ చద్దా కూడా విడుదల అవ్వబోతుంది. ఈ మూడు కాకుండా మరోటి కూడా ప్రస్తుతం చర్చల దశలో ఉన్నది వచ్చే ఏడాదిలోనే విడుదల చేసేలా చైతూ ప్లాన్ చేస్తున్నాడు. మరో వైపు ఒక వెబ్‌ సిరీస్ ను చేస్తున్నాడు. అందులో చైతూ నెగటివ్ షేడ్స్ తో కనిపించబోతున్నాడు.