Begin typing your search above and press return to search.
తప్పు.. తోసిన స్టార్ ది కాదు పడ్డోడిదే
By: Tupaki Desk | 19 Sept 2016 10:42 AM ISTగణపతి నిమజ్జనం రోజున.. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్.. రణధీర్ కపూర్ లు మీడియాతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఓ విలేఖరిపై చెయ్యి చేసుకున్నట్లుగా వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే. దీనిపై పోలీసులు కూడ విచారణ జరుపుతున్న సమయంలో.. ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు ఆ విలేఖరి.
'రణ్ బీర్ ఫొటోలు తీయడానికి నేను వెళుతున్నాను. అప్పటికే ఆయన కారులో కూర్చున్నారు. ఆ సమయంలో కెమెరా వైరు కాలికి తగిలడంతో.. నేను కింద పడిపోయాను' అంటూ స్టోరీలో ట్విస్ట్ ఇచ్చాడు. 'రిషి కపూర్ - రణ్ ధీర్‌లు మీడియా - అభిమానులతో అనుచితంగా ప్రవర్తించారని అనడం కూడా నిజం కాదు. మాట్లాడుతున్న వీడియోలని... కొడుతున్నట్లు మార్చేసి చూపిస్తున్నారు. ఓ వైపు వర్షం పడుతుంటే వారి చుట్టూ వందల మంది వచ్చి గుమిగూడడంతో రిషి కాస్త చిరాకు పడ్డారంతే. ఎవరి పైనా చెయ్యి చేసుకోలేదు. అలాగని అమర్యాదకరంగా ప్రవర్తించలేదు' అని చెప్పాడు ఆ రిపోర్టర్.
మొత్తం ఇన్సిడెంట్ లో కీలకమైన విలేకరి తమకు మద్దతుగా నిలించేసరికి.. రిషి బోలెడు సంతోషంగా ఉన్నాడు. అభిమానులకు.. అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ పెట్టి... మీడియా ఏవేవో వూహించుకుని రాసేసి అవే నిజం అనుకుంటోందంటూ ఆగ్రహం ప్రదర్శించారు రిషి కపూర్.