Begin typing your search above and press return to search.

#మీటూ: టాలీవుడ్ హీరో అలా చేశాడట!

By:  Tupaki Desk   |   16 Oct 2018 7:09 AM GMT
#మీటూ: టాలీవుడ్ హీరో అలా చేశాడట!
X
బాలీవుడ్ లో #మీటూ ఇప్పుడు ఒక బర్నింగ్ టాపిక్. ఎంతోమంది సీనియర్ యాక్టర్లపై.. డైరెక్టర్ల పై ఆరోపణలు వచ్చాయి. కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు సగంలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఇంకా ఈ #మీటూ హీట్ గట్టిగా తగలలేదనే మనం అనుకోవాలి. తాజా గా ఓ అజ్ఞాత లేడీ జర్నలిస్ట్ తనను ఒక తెలుగు హీరో వేధించాడని ఆరోపించింది.

ఈ తెలుగు హీరో ఒక ఫేమస్ తెలుగు సింగర్ కు భర్త అని అ మహిళ తెలిపింది. ఈ లైంగిక వేధింపుల సంఘటన 2015 లో జరిగిందట. ఆసమయంలో ఒక కథనం రాసే విషయమై ఆ హీరోను సంప్రదించవలసి వచ్చిందట. అ హీరో ను కలిసి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత రెండు రోజులకు ఆ కథనం రెడీ అయిందట. ఇక పబ్లిష్ చేస్తే.. ఆ హీరో తో పనేమీ ఉండదు అనుకుందట. కానీ అప్పుడే అసలు కథ మొదలైందట. అర్థరాత్రి 2 గంటలకు 'హాయ్' అని మెసేజ్ పెట్టాడట. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు రాత్రి మెసేజ్ పెట్టారు ఏదైనా ఇంపార్టెంట్ ఉందా అని మెసేజ్ పెట్టిందట. దీనికి "నీ గొంతు విన్నప్పటినుండి నీ గురించే ఆలోచిస్తున్నా" అని హింట్ ఇచ్చాడట. అప్పటినుండి ఏదో ఒక కారణంతో మెసేజ్ లు పెట్టడం స్టార్ట్ చేశాడట. దాంతో రెస్పాండ్ అవడం తగ్గించిందట. ప్రొఫైల్ పిక్ మారిస్తే మెసేజ్ పెడుతున్నాడని ప్రొఫైల్ పిక్ మార్చడం కూడా మానేసిందట.

ఈ గోల భరించలేక ఒకసారి "మీరు పెళ్లైంది కదా" అని గుర్తు చేస్తే "నువ్వు సీక్రెట్ గా ఉంచితే నేను సీక్రెట్ గ ఉంచుతా" అన్నాడట. ఒకసారి "నీలాంటి డేరింగ్ జర్నలిస్ట్ తో ఉన్నట్టు ఊహించుకుంటున్నా" అని కూడా చెప్పాడట. దీంతో ఫైనల్ గా ఒక రోజు "నాకు ఇంట్రెస్ట్ లేదు" అని డైరెక్ట్ గా చెప్పిందట. అప్పటినుండి అస్సలు రెస్పాండ్ కాలేదట. అదండీ ఆ అజ్ఞాతమహిళ చెప్పిన తెలుగు హీరో కామాతురాణం కథ.