Begin typing your search above and press return to search.

నటి వారానికి నాలుగుసార్లు ఒళ్లమ్ముకునేదట

By:  Tupaki Desk   |   21 Jun 2016 3:00 PM IST
నటి వారానికి నాలుగుసార్లు ఒళ్లమ్ముకునేదట
X
డబ్బుల కోసం ఒళ్లమ్ముకునేదాన్ని అంటూ ఆ మధ్య బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా చెప్పిన మాటలు విని విస్తుబోయారు ఇండియన్ ఆడియన్స్. ఇలా చేసేవాళ్లు చాలామందే ఉంటారు కానీ.. ఓపెన్ గా ఒప్పుకోవడానికి ఎంతో గట్స్ ఉండాలి. మన గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదనే తెగింపు ఉండాలి. తాజాగా ఓ హాలీవుడ్ నటి సైతం ఇలాంటి సెన్సేషనల్ కామెంట్లే చేసింది. తాను వారానికి మూణ్నాలుగుసార్లు డబ్బు కోసం చాలామంది దగ్గర పడుకునేదాన్నని వెల్లడించింది ప్రముఖ హాలీవుడ్ నటి జోసెఫ్ గిలాన్. మత్తుపదార్థాల బారిన పడిన తాను వాటి కోసం ఒళ్లు అమ్ముకున్నానని ఆమె వెల్లడించింది.

తన జీవితమంతా డ్రగ్స్.. వ్యభిచారం.. అశ్లీలంతో ముడిపడిందని చెప్పిన జోసెఫ్ గిలాన్.. ఫాంటసీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్ ’లో నటించడం మొదలుపెట్టాకే తన జీవితంలో మార్పు వచ్చిందని తెలిపింది. ‘‘నేను ఒకప్పుడు కొకైన్ కు బానిసను. దాని కోసం నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. ఐతే తర్వాత కొకైన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. వారానికి మూడు నాలుగుసార్లు నా శరీరాన్ని అమ్ముకునేదాన్ని. పెద్ద పెద్దవాళ్లతో గడిపి వేల పౌండ్లు సంపాదించేదాన్ని. ఒక రాత్రికి నాలుగువేల పౌండ్లు చెల్లించేవాళ్లు. ఆ డబ్బుతో నేను నా జీవితాన్ని నిలబెట్టుకోవాల్సింది. కానీ డ్రగ్స్ కోసమే ఆ డబ్బు ఖర్చు చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ నన్ను రక్షించింది. నాకు మళ్లీ జీవితాన్ని ప్రసాదించింది’’ అని చెప్పింది జోసెఫ్ గిలాన్.