Begin typing your search above and press return to search.

వర్మ మీద ఇంకో పాట రాబోతుంది

By:  Tupaki Desk   |   24 July 2020 8:00 PM IST
వర్మ మీద ఇంకో పాట రాబోతుంది
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కొందరు వ్యక్తులను టార్గెట్‌ చేస్తూ చేస్తున్న సినిమాలు వారి అభిమానుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయి. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా వర్మ తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. దాంతో ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశ్యంతో కొందరు వర్మకు వ్యతిరేకంగా సినిమాలు తీసేందుకు సిద్దం అవుతున్నారు. వర్మ ప్రస్తుతం పవర్‌ స్టార్‌ చిత్రంను విడుదలకు సిద్దం చేస్తున్న నేపథ్యంలో కొందరు పవన్‌ మద్దతుదారులు ‘పరాన్నజీవి’ అనే చిత్రాన్ని తెరకెక్కించి విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. పరాన్నజీవిలోని ఒక పాటను ఇటీవలే విడుదల చేశారు.

ఆ పాటలో వర్మను తీవ్రంగా ట్రోల్‌ చేశారు. అతడిపై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో కామెంట్స్‌ చేస్తూ ఆ పాటను చూపించారు. ఇప్పుడు ఆర్జీవీపై మరో పాట రాబోతుంది. కొన్ని రోజుల క్రితం ఆర్జీవీ మరియు ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావులకు మద్య మాటల యుద్దం జరిగింది. ఆ సమయంలోనే జొన్నవిత్తుల ఆర్జీవీ అనే సినిమాను తీయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ సినిమాకు సంబంధించిన పాటను ఇప్పుడు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

వోడ్కా మీద ఒట్టు నేన్‌ బడ్కావ్‌ నా కొడుకుని... అంటూ సాగే పాటను నేడు సాయంత్రం 6.30 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ పాటకు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ వీణాపాణి ట్యూన్‌ అందించాడు. ఈ లిరికల్‌ వీడియోను ఆర్జీవీ టీం విడుదల చేయబోతున్న నేపథ్యంలో సినిమా గురించిన చర్చ తారా స్థాయిలో జరుగుతుంది. ఒక వైపు పరాన్నజీవి మరో వైపు ఆర్జీవీ సినిమాతో వర్మ వ్యతిరేకుల దాడి మరింత పెరగనుంది. ఈ పరిస్థితులను వర్మ ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి.