Begin typing your search above and press return to search.

'బీస్ట్' సెట్ లో జానీ మాస్టర్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ఇళయదళపతి..!

By:  Tupaki Desk   |   2 July 2021 4:16 PM GMT
బీస్ట్ సెట్ లో జానీ మాస్టర్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ఇళయదళపతి..!
X
కొరియోగ్రాఫర్ జానీ టాలీవుడ్‌ స్టార్ హీరోలందరికి డ్యాన్స్ కంపోజ్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సిగ్నేచర్ మూమెంట్స్ తో స్టైలిష్‌ స్టెప్పులతో అలరిస్తున్న జానీ మాస్టర్.. తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లోనూ మంచి పేరు సంపాదించారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' సినిమాలోని 'సీటీమార్' సాంగ్ కు కొరియోగ్రఫీ చేసి నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు. డ్యాన్స్ మాస్టర్ గా కొనసాగుతూనే హీరోగా మారి రెండు సినిమాలు చేస్తున్నారు జానీ.

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న 'బీస్ట్' చిత్రానికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందులోని అన్ని పాటలకు జానీ డ్యాన్స్ కంపోజ్ చేస్తుండటం విశేషం. కోవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ను.. సాంగ్ షూట్ తో తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఉన్న జానీ మాస్టర్ ను 'బీస్ట్' టీమ్ సర్ప్రైజ్ చేసింది. నేడు కొరియోగ్రాఫర్ పుట్టినరోజు కావడంతో సెట్ లోనే సెలబ్రేషన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో జానీ మాస్టర్ విజయ్ ను ఆప్యాయంగా కౌగిలించుకుని నవ్వుతూ కనిపిస్తున్నాడు. మరొక ఫోటోలో డ్యాన్స్ మాస్టర్ కి 'బీస్ట్' డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ బొకే అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే జానీ మాస్టర్ బర్త్ డే స్పెషల్ గా హీరోగా నటిస్తున్న '#J1' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అలానే 'మంత్ర' 'మంగళ' ఫేమ్ ఓషో తులసీరామ్‌ దర్శకత్వంలో జానీ హీరోగా 'దక్షిణ' అనే చిత్రాన్ని ప్రకటించారు.