Begin typing your search above and press return to search.
హీరోగా జానీ మాస్టర్.. షూటింగ్ ప్రారంభం
By: Tupaki Desk | 29 Dec 2020 11:30 AM ISTప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరో అయ్యారు. సుజి విజువల్స్ బ్యానర్‌పై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వం వహిస్తున్న సినిమాలో జానీ హీరోగా నటిస్తున్నారు. ఆయన సరసన ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ నటిస్తోంది. కే వెంకటరమణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభ వేడుకకు ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, నిర్మాత లగడపాటి శ్రీధర్, ప్రముఖ నటుడు నాగబాబు, యాంకర్ ప్రదీప్ హాజరయ్యారు. తొలి షాట్‌కు దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. నటుడు నాగబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్బంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘జానీ మాస్టర్ డెఫినెట్‌గా వండర్‌పుల్ యాక్టర్ అవుతారు. ఎంటర్‌టైనింగ్ హీరోగా అవుతారనే నమ్మకం బలంగా కలిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే చాలా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి. వాటితో దర్శకుడు అభిరుచి ఏమిటో తెలిసింది. త్వరలోనే జానీ మాస్టర్‌తో స్టైల్2 సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాం.’’ అని అన్నారు.
నాగబాబు మాట్లాడుతూ, "జానీ మాస్టర్ మా అందరికీ, ముఖ్యంగా మా మెగా ఫ్యామిలీకి చాలా ఆత్మీయుడు. అద్భుతమైన డాన్స్ ప్రతిభ అలాగే అందం ఉన్నవాడు జానీ, ఇలాంటి మంచి కథ తో హీరోగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటాడని నేను నమ్ముతున్నాను." అని అన్నారు.
యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ.. ‘‘మా జానీ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్నారంటే మాకు చాలా ఆనందం. కెమెరా ముందు ఎంత యాక్టివ్‌గా ఉంటారో.. కెమెరా వెనుక కూడా అంతే ఎనర్జీతో రౌండ్ ది క్లాక్ ఉంటారు. మాకు డార్లింగ్.. మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన హీరోగా సక్సెస్‌ఫుల్ కావాలని కోరుకొంటున్నాను’’ అన్నారు.
హీరో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘నేను హీరోగా పరిచయం అవుతున్న సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన దర్శకులు వీవీ వినాయక్ గారికి, నిర్మాత లగడపాటి శ్రీధర్, నాగబాబు గారికి, యాంకర్ ప్రదీప్‌కు ధన్యవాదాలు. నాకు కొరియోగ్రఫి అంటే చాలా ఇష్టం. దర్శకుడు చెప్పిన ఈ కథ విన్న తర్వాత తప్పకుండా చేయాలని డిసైడ్ అయ్యాను.’’ అని అన్నారు.
నిర్మాత వెంకటరమణ. కె మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని, సుజి విజువల్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నాను. జానీ మాస్టర్ గారి కోరియోగ్రఫీ మాకు చాలా ఇష్టం. ఆయనతో ఎప్పుటికైనా సినిమా చేయాలి అనుకున్నాం, అది ఈ విధంగా కుదిరింది.’’ అని అన్నారు.