Begin typing your search above and press return to search.

చెర్రీ గుండె నిండా గోల్డే - జానీ మాస్టర్

By:  Tupaki Desk   |   22 Dec 2015 10:08 PM IST
చెర్రీ గుండె నిండా గోల్డే - జానీ మాస్టర్
X
జానీ మాస్టర్ గా తెలుగు ప్రేక్షకులకు షేక్ జానీ బాషా పరిచితుడే. ఈ డ్యాన్స్ మాస్టర్ హృదయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఓ గుడి కట్టేసుకున్నాడు. టాలీవుడ్ లో జానీ మాస్టర్ కి మొదటి బ్రేక్ ఇచ్చిందని చెర్రీనే. చరణ్ ని తనకు పెద్దన్నగాను, అతని గుండె గోల్డ్ అని చెప్పే జానీ.. చెర్రీని ఇంతగా ఆరాధించడానికి బోలెడు కారణాలు చెబ్తాడు.

" నా భార్య 8వ నెల కడుపుతో ఉన్నపుడు నా దగ్గర డబ్బులు అయిపోయాయి. ఏ ఆశ కనిపించని సమయంలో రామ్ చరణ్ సార్ కి ఫోన్ చేశాను. ఆయన నన్ను అపోలో హాస్పిటల్స్ కి పంపారు. కొన్ని రోజుల తర్వాత ఓ పండంటి బాబును నా భార్య ప్రసవించింది. అయితే ఆస్పత్రి బిల్లు 5 లక్షలు అయింది. ఇందులో కేవలం రూ.350 మాత్రమే నా కొడుకు పాలడబ్బా కోసం కట్టాను. మిగతా అంతా రామ్ చరణ్ - ఉపాసన చూసుకున్నారు. ఆ తర్వాత నేను చరణ్ ని కలిసినపుడు ఇలా చెప్పారు 'మేం మనుషుల ట్యాలెంట్ ను మాత్రమే వాడుకోం. ఒకసారి మేం చెయ్యి ఇచ్చామంటే, అది జీవిత మొత్తానికి ఇచ్చినట్లే' అన్నారు. నన్ను తన సొంత తమ్ముడిగా చూసుకునేంత గొప్ప మనస్తత్వం రామ్ చరణ్ ది." అంటూ కన్నీళ్లతో తన అనుభవాన్ని, రామ్ చరణ్ మనస్తత్వాన్ని వివరించాడు జానీ మాస్టర్.

"చరణ్ కు గర్వం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆయన ఎవరితో అయినా కలిసేందుకు సమయం తీసుకుంటారు. ఆయన గుండె బంగారం లాంటింది. అచ్చం బాబాయి పవన్ కళ్యాణ్ లాంటి కేరక్టరే. ఇద్దరి మనసులు ఒకే రకంగా మంచితనంతో నిండి ఉంటాయి" అన్నాడు జానీ మాస్టర్. నాయక్ లో లైలా ఓ లైలా - రేసుగుర్రంలో సినిమా చూపిస్త మామా పాటలకు అందించిన కొరియోగ్రఫీ.. జానీ మాస్టర్ ను టాప్ డ్యాన్స్ డైరెక్టర్ గా చేశాయి.