Begin typing your search above and press return to search.

రజనీ కి యాంటీ గా జాన్ విజయ్

By:  Tupaki Desk   |   3 Sept 2015 9:43 PM IST
రజనీ కి యాంటీ గా జాన్ విజయ్
X
కొన్ని సార్లు ఇంతే. సినిమా సెట్స్ కి వెళ్ళే లోపు కాస్ట్ అండ్ క్రూ లిస్టు లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అయితే సూపర్ స్టార్ రజనీ సినిమా కి ఇదే రిపీట్ అవడం విశేషం. అదీ ప్రకాష్ రాజ్ లాంటి నటుడు సినిమా
నుండి వైదొలగడం. వివరాల్లోకెళితే.. తమిళ యువ దర్శకుడు పి.ఎ. రంజిత్ దర్శకత్వంలో రజనీ కబాలి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాఫియా డాన్ గా రజనీ నటుస్తున్న ఈ సినిమాలో రజనీ కి యాంటీ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించాల్సుంది. ముందుగా ఈ సినిమా కి ఆకర్షణగా నిలిచినా అంశాల్లో వీరి కాంబినేషన్ ఒకటి. ప్రకాష్ రాజ్ ఎంత బిజీ నటుడో తెలిసిందే. ప్రస్తుతం డేట్స్ సర్డుబాటు కాక ఈ సినిమా నుండి ప్రకాష్ రాజ్ తప్పుకున్నారట. ఈ స్థానాన్ని జాన్ విజయ్ అనే నటుడి తో భర్తీ చేశారట.

జాన్ విజయ్ తమిళ, మలయాళ భాషల తో పాటు ఒకటి రెండు హిందీ సినిమా ల్లోనూ నటించాడు. నారా రోహిత్ హీరో గా నటించిన శంకర సినిమాలోనూ నటించాడు. ఆ సినిమా రిలీజ్ అయుంటే తెలుగు వారికి పరిచయం అయుండేవాడు. అన్నట్టు... మొన్నా మధ్య సిద్ధార్థ్ హీరో గా వచ్చిన ఎనక్కుల్ ఒరువన్ (తెలుగులో నాలో ఒకడు) లూసియా... అంటూ ఓ వైవిధ్య పాత్ర లో కనిపించింది ఇతనే. అసలే అనువాద సినిమా, పైగా కాస్త భిన్న మైన కథ కావడంతో మనవాళ్ళు ఎంతమంది చూశారో తెలీదు కానీ ఇతగాడి నటన మాత్రం ప్రేక్షక రంజకం గానే వుంది. ఇలాంటి వారికి రజనీ సినిమా లో అవకాశం రావడం శుభ పరిణామమే.