Begin typing your search above and press return to search.

అభిమాని సెల్ఫీ పిచ్చికి చెంప దెబ్బ..?

By:  Tupaki Desk   |   30 Sept 2016 5:50 PM IST
అభిమాని సెల్ఫీ పిచ్చికి చెంప దెబ్బ..?
X
ఈ మధ్యకాలంలో "సెల్ఫీ" పై ప్రతీ రోజూ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవసాత్తు ఒకరు మృతి అని, సెల్ఫీ మోజులో పిచ్చి పనులు అని... ఇలా రకరకాల కథనాలు మీడియాలో చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన కూడా సెల్ఫీ కోసమే అని తెలుస్తుంది. బాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ విషయంలో నిజా నిజాలు ఇంకా తెలియదు కానీ... సెల్ఫీ కోసం అతి చేసిన ఒక వ్యక్తికి చెంపదెబ్బ బహుమతిగా ఇచ్చాడట బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం!

బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం ఓ అభిమానిపై చేయి చేసుకున్నాడన్న వార్తలు బాలీవుడ్ లో ఇప్పుడు గుప్పుమంటున్నాయి. తాజాగా "ఫోర్స్-2" ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగిన వేడుక అనంతరం జాన్ అబ్రహాం అక్కణ్ణుంచి తిరిగి వెళ్లడానికి సిద్దమయ్యాడట. ఈ సమయంలో ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసరికి అభిమానులు ఒక్కసారిగా అతడి వద్దకు పరుగెత్తుకొచ్చారట. వారిని తప్పించుకుంటూ బయటకు కదులుతున్న జాన్‌ ను ఒక వ్యక్తి చెయ్యిపట్టి లాగి సెల్ఫీ తీసుకోబోయాడట. దీంతో సుర్రుమనిపించి ఒళ్లు మండిన జాన్ అతడిని లాగి చెంప దెబ్బ కొట్టాడని బీ టౌన్ టాక్. అక్కడితో ఆగని జాన్, ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న మీడియా మిత్రులతో "ఈ సంఘటనను ప్రచురించవద్దు" అని చిన్నపాటి హెచ్చరిక చేసి వెళ్లిపోయాడట.

ఈ ఇష్యూకి సంబందించిన వార్తలు ప్రస్తుతం బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయాలపై స్పందించిన జాన్... ఈ వార్తలను తీవ్రంగా ఖండించాడు. కాగా ఈ బాలీవుడ్ హీరో ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోడని, భావోద్వేగాలు అదుపులో పెట్టుకుని విసిగించినా సహించుకుంటాడని బీ టౌన్ జనాల్లో మంచి పేరే ఉందట!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/