Begin typing your search above and press return to search.

అమెరికన్ యాంకర్ కి తెగ నచ్చేసింది

By:  Tupaki Desk   |   11 Sept 2017 7:02 PM IST
అమెరికన్ యాంకర్ కి తెగ నచ్చేసింది
X
ఓ ఇండియన్ సినిమా గురించి.. అది కూడా ఓ సౌతిండియన్ మూవీ గురించి.. హాలీవుడ్ స్థాయిలో చర్చ జరగడం.. అది కూడా ఓ పాటపై డిస్కషన్స్ జరగడం అనేది చాలా అరుదైన విషయం. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఇలాంటి సంచలనమే నమోదు చేస్తోంది. వెండిపలింతె పుస్తకం అనే టైటిల్ పై రూపొందుతున్న సినిమాలో యాక్ట్ చేస్తున్నారు మోహన్ లాల్.

త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించి.. ఓ పాటను రీసెంట్ గా రిలీజ్ చేశారు. జిమ్మిక్కి కమ్మల్ అంటూ సాగే ఈ పాటను రిలీజ్ చేయగా.. జనాలను ఈ సాంగ్ బాగానే ఆకట్టుకుంటోంది. కుర్రకారు డ్యాన్సులు కూడా బాగున్నాయి. అయితే.. ఈ పల్లవిలో ఉన్న పదాల మాదిరి పేరు గల అమెరికన్ యాంకర్ జిమ్మీ కిమెల్.. ఈ పాట గురించి స్పెషల్ గా ట్వీట్ పెట్టాడు. తన పేరుకు దగ్గరగా ఉన్న ఈ పదాలు బాగా నచ్చాయని అంటున్నాడు. తనకు ఆయా పదాలకు అర్ధం తెలియకపోయినా.. సాంగ్ చాలా బాగుందని.. తన పేరులోని పదాల మాదిరిగా పాట కట్టడం.. ట్యూన్ చేయడం.. భలే నచ్చేసిందని అంటున్నాడు జిమ్మీ కిమెల్.

ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన ఈ పాటపై.. స్వయంగా జిమ్మి కిమెల్ పోస్ట్ చేయడంతో.. ఇదిప్పుడు వరల్డ్ వైడ్ ట్రెండింగ్ టాపిక్ గా కూడా మారిపోతోంది. ఇక ఈ క్యాచీ ట్యూన్ కి తగినట్లుగా.. జనాలు పేరడీ వీడియోలతో నానా హంగామా చేసేస్తుండడం విశేషం.