Begin typing your search above and press return to search.

సాంగుకి సుమ సిందులు సూస్తిరా?

By:  Tupaki Desk   |   14 Sep 2017 12:59 PM GMT
సాంగుకి సుమ సిందులు సూస్తిరా?
X
స్టార్ యాంకర్ సుమ ఇప్పటికే తనలోని ట్యాలెంట్ చాలా రకాలుగా చూపించేసింది. యాంకర్ గా హోస్ట్ గా ఆమె ప్రతిభను అంచనా వేయడం ఎవరి తరం కాదని అనిపించేసింది. ఈ మధ్యనే ఓ పాట కూడా పాడేసి తనలోని గాయనిని కూడా పరిచయం చేసిన సుమ.. ఇప్పుడు నృత్య ప్రతిభను కూడా వెలికితీసింది.

అయితే.. ఇంతకు ముందు చూపించిన ట్యాలెంట్స్ అన్నీ ప్రొఫెషనల్ అయితే ఈ డ్యాన్సింగ్ ప్రతిభ మాత్రం ప్యూర్లీ పర్సనల్. ప్రస్తుతం జిమ్మిక్కి కమ్మల్ అంటూ సాగే మలయాళ సాంగ్.. ట్రెండింగ్ అయిపోయిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ నటిస్తున్న వెలిపడింతె పుస్తకం లోని ఈ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడదే పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ వేసేసింది సుమ. జిమ్మిక్కి కమ్మల్ నన్ను తెగ అలరిస్తోందని చెప్పి మరీ తెగ స్టెప్పులు వేసేసింది ఈ స్టార్ యాంకర్. అసలు సుమ స్టెప్స్ చూస్తుంటే.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ కి ఏ మాత్రం తీసిపోదనే సంగతి అర్ధమయిపోతుంది. ఇంత ట్యాలెంట్ చూసి ఆమెకు ఓ పాటకు డ్యాన్స్ చేయమని మేకర్స్ అడిగినా ఆశ్చర్యమేమీ లేదు.

అయితే.. ఇప్పటికే అనేక టీవీ షోలలో పార్టిసిపెంట్స్ తో కలిసి ఎన్నో మార్లు డ్యాన్స్ చేసిన సుమకు.. డ్యాన్స్ లో ఈ మాత్రం టచ్ ఉండడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు కానీ.. అలా తను డ్యాన్స్ చేసి నెట్ లో పెట్టేయడమే కొత్త విషయం. ఇంతకీ ఇన్ని తెలుగు హిట్ సాంగ్స్ ఉంటే.. మలయాళ పాటకి డ్యాన్స్ చేసి చూపించాల్సిన అవసరం ఏంటనుకుంటున్నారా.. సుమ స్వతహాగా మలయాళీ అని గుర్తు చేసుకుంటే ఆన్సర్ దొరికేసినట్లే.