Begin typing your search above and press return to search.

ఇతనికి తెగ డిమాండ్ పెరిగింది

By:  Tupaki Desk   |   16 Feb 2018 2:30 AM GMT
ఇతనికి తెగ డిమాండ్ పెరిగింది
X
ఒక్కొసారి 20 సినిమాలు చేసిన అంత గుర్తింపు రాకపోవచ్చు కానీ కొందరికి ఒక్క సినిమా చాలు. రవి తేజ చెప్పినట్టు 'ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్' చాలు వాళ్ళ ప్రతిభను నిరూపించడానికి. సోనమ్ కపూర్ నటించిన 'నీరజ' తో అరంగేట్రం చేసిన జిమ్ సర్బ్ కి కూడా ఆ ఛాన్స్ పద్మావత్ ఇచ్చింది.

సంజయ్ లీల భన్సాలి దర్శకవత్వం వహించిన దృశ్యకావ్యమే పద్మావత్. రాణి పద్మిని జీవిత చరిత్ర ఆధారంగా రూపు దిద్దుకున్న ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టేస్తోంది. అందులో రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొనె - షాహిద్ కపూర్ తో పాటు తన నట విశ్వరూపం చూపిన నటుడు ఇంకొకడు ఉన్నాడు. అతనే జిమ్ సర్బ్. అలాఉద్దీన్ ఖిల్జీ పక్కన ఉండే మాలిక్ కఫుర్ పాత్రను పోషించాడు. ఈ ఒక్క సినిమా ఇతని కెరీర్ లో ఒక మైలు రాయి గా మిగిలిపోతుంది అనటంలో అబద్దం లేదు. ఇందులో ఇతని యాక్టింగ్ కి చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇతని వెనక క్యూ కట్టేస్తున్నారు. ఇతని డిమాండ్ చాలా పెరిగిపోయింది.

సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా మన ముందుకు రాబోతున్న సంజు సినిమా లో రన్ బీర్ కపూర్ టైటిల్ రొల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో జిమ్ సర్బ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. అలానే మూతోన్ అనే సినిమా లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు టాక్.