Begin typing your search above and press return to search.

రీమేక్‌ రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పడినట్లే

By:  Tupaki Desk   |   14 April 2015 3:30 PM GMT
రీమేక్‌ రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పడినట్లే
X
పవన్‌ కళ్యాణ్‌-చరణ్‌ చేస్తున్నారా? బాలయ్య-ఎన్టీఆర్‌ చేస్తున్నారా? బాలయ్య-కళ్యాణ్‌రామ్‌ చేస్తున్నారా? వెంకటేష్‌-రవితేజ చేస్తున్నారా? అంత లేదు. ఎవ్వరూ చేయట్లేదు. అసలు రీమేక్‌ సినిమాలంటేనే ఈ మధ్యన కాస్త అసహనం వ్యక్తమవుతోంది. ఆడియన్స్‌ ఆల్రెడీ సదరు సినిమాలను చూసేస్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా వాటిని తెలుగులో చూడ్డానికి ఇష్టపడట్లేదు. ఇకపోతే మనం ప్రస్తుతం ''జిల్లా'' అనే సినిమా గురించి చెప్పుకునే రీమేక్‌ కబుర్లకు ఇక ఫుల్‌స్టాప్‌ పడిపోయింది.

నిజానికి హీరో విజయ్‌, మలయాళ హీరో మోహన్‌లాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్‌ తమిళ సినిమా ఈ ''జిల్లా''. ఇక దీన్ని తెలుగులో రిలీజ్‌ చేయకుండా, అప్పట్లో పవన్‌-చరణ్‌లతో రీమేక్‌ చేస్తున్నారు అనే న్యూస్‌ వచ్చింది. దానికి తగ్గట్లే నిర్మాత ఆర్‌.బి.చౌదరి సినిమా డబ్బింగ్‌ రైట్స్‌ను ఎవ్వరికీ అమ్మకపోవడంతో.. మనోళ్ళు ఎవరితోనో ఒకరితో రీమేక్‌ చేస్తారనే అనుకున్నాం. కట్‌ చేస్తే బాలయ్య-ఎన్టీఆర్‌ పేరు తెర మీదకు వచ్చింది. అది జరిగే పని కాదని తెలిసిందే. ఇక బాలయ్య-కళ్యాణ్‌రామ్‌ అన్నారు.. అదీ వర్కవుట్‌ కాలేదు. చివరకు వెంకటేష్‌-రవితేజ అనుకున్నాసరే.. అదీ సెట్టవ్వలేదు. ఇంకేముంది, ఇప్పుడు సినిమాను డబ్బింగ్‌ చేసి డైరక్ట్‌గా రిలీజ్‌ చేస్తున్నారు. అదండీ చిత్రం!!!