Begin typing your search above and press return to search.

జాన్వీ (X) సారా: చ‌క్క‌న‌మ్మ‌ల స్నేహం అలా కుదిరింది!

By:  Tupaki Desk   |   13 July 2022 11:30 PM GMT
జాన్వీ (X) సారా: చ‌క్క‌న‌మ్మ‌ల స్నేహం అలా కుదిరింది!
X
బాలీవుడ్ యువ‌నాయిక‌లు సారా అలీఖాన్- జాన్వీ కపూర్ ల మధ్య స్నేహం అభిమానులకు కొత్తేమీ కాదు. ఈ జోడీ తరచుగా వెకేష‌న్ స్పాట్స్ నుంచి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇటీవ‌లే ఆ ఇద్ద‌రూ కలిసి కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించిన‌ప్ప‌టి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. సారా అలీ ఖాన్ - జాన్వీ కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించిన ఫోటోలను అభిమాన సంఘాలు పోస్ట్ చేయ‌గా వాటిలో ఇద్దరూ శివుడిని ప్రార్థిస్తూ కనిపించారు.

అంత‌కుముందు కూడా వీరిద్దరూ రణవీర్ సింగ్ 'ది బిగ్ పిక్చర్' అనే టీవీ షోలో కనిపించారు. త‌మ మ‌ధ్య‌ స్నేహం గురించి మాట్లాడారు. ఎపిసోడ్ సమయంలో రణవీర్- జాన్వీ -సారాలను వారి స్నేహం (స్నేహితులు) గురించి ఎక్కువ‌గా అడిగాడు. నిజానికి ఆ ఇద్ద‌రికీ కామ‌న్ ఫ్రెండ్స్ ఉన్నారు. కాల‌క్రమంలో స్నేహం కుదిరింది.

జాన్వీ అందించిన వివ‌రాల ప్ర‌కారం.. ఆ ఇద్ద‌రికీ చిన్న‌ప్ప‌టి నుంచి ప‌రిచ‌యం ఉంది. నేను సారాను ఒక అవార్డు ఫంక్షన్ లో మొదటిసారి కలిశాను. నేను ముమ్మా (దివంగత నటి శ్రీదేవి)తో కలిసి త‌న‌ని క‌లిసిన‌ప్పుడు మేము చాలా చిన్నవాళ్లం అని కూడా జాన్వీ తెలిపింది. సారా అమృత ఆంటీ (సారా తల్లి అమృతా సింగ్).. బార్ బార్ హీరోయిన్ నాకు ఇప్పటికీ గుర్తుంది అని జాన్వీ ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

ఇప్పుడు ఇదే జోడీ మ‌రోసారి కాఫీ విత్ క‌ర‌ణ్ తాజా సీజ‌న్ లో సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే క్ర‌మంలో లేటెస్ట్ ఫోటోషూట్ లో క‌వ్వించే విరుపుల‌తో విరుచుకుప‌డ్డారు. జాన్వీ కాస్త కొంటెత‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తే.. సారా ఎప్ప‌టిలానే ఎంతో స్పైసీగా ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

జాన్వీ 2018లో శశాంక్ ఖైతాన్ రొమాంటిక్ డ్రామా చిత్రం ధడక్ తో ఇషాన్ ఖట్టర్ స‌ర‌స‌న డెబ్యూ న‌టిగా ప‌రిచ‌య‌మైంది. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది. అప్పటి నుండి కెరీర్ ప‌రంగా వెనక్కి తిరిగి చూసుకున్న‌దే లేదు. మామ్ శ్రీ‌దేవి ఆశ‌ల్ని నెర‌వేరుస్తూ అగ్ర ప‌థంలోకి దూసుకెళుతోంది. యువ‌నాయిక వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది. ఘోస్ట్ స్టోరీస్- గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ -రూహి వంటి చిత్రాలలో నట‌న‌కు గొప్ప పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది.

సారా ఇటీవ‌ల‌ వరుణ్ ధావన్ తో కామెడీ చిత్రం కూలీ నెం.1లో ధ‌నుష్ - అక్ష‌య్ ల అత్రాంగిరే చిత్రాల్లో క‌నిపించింది. త‌దుప‌రి వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. ఇంత‌లోనే త‌న స్నేహితురాలు జాన్వీతో క‌లిసి కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7 లో క‌నిపిస్తోంది.