Begin typing your search above and press return to search.

పెళ్ళైన హీరోతో జాన్వీ అలా..

By:  Tupaki Desk   |   13 July 2022 3:30 AM GMT
పెళ్ళైన హీరోతో జాన్వీ అలా..
X
అతిలోకసుందరి శ్రీదేవి గారాల కూతురు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది. అయితే ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కావడం లేదు. మొదట్లో చేసిన సినిమాలు అన్నీ కూడా డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదలయ్యాయి. ఇక ప్రస్తుతం ఓ వర్గం యువ హీరోలతో మంచి సినిమాలు చేస్తోంది.

ఆ సినిమాలో సక్సెస్ అయితే మాత్రం ఈ బ్యూటీ స్థాయి మరో లెవల్ కు వెళ్లినట్లే అని చెప్పవచ్చు. ఇక రీసెంట్గా జాన్వీ కపూర్ ఒక పెళ్లైన హీరోతో షూటింగ్ గ్యాప్ లో తనకు ఇష్టమైన ప్రదేశాలను చుట్టేస్తున్నట్లు సమాచారం.

వరుణ్ ధావన్ తో జాన్వీ కపూర్ గత 2 నెలలుగా యూరప్‌లో బావాల్ సినిమా షూటింగ్ కోసం వెళ్లింది. నితేష్ తివారీ దర్శకత్వంలో సాజిద్ నదియాడ్‌వాలా ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న 'బవాల్' షూటింగ్ మొన్నటి వరకు గ్యాప్ శరవేగంగా కొనసాగింది.

అయితే లాంగ్ షెడ్యూల్ అనంతరం వరుణ్ తో కలిసి జాన్వీ కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలను సందర్షిస్తోందట. వీరిద్దరూ పారిస్, ఆమ్‌స్టర్‌డ్యామ్‌తో సహా పలు యూరోపియన్ దేశాలలో షూటింగ్ చేసారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ కోసం పోలాండ్‌లో ఉన్నారు. కొంచెం గ్యాప్ రావడంతో పోలాండ్‌లోని ఆష్విట్జ్ నాజీ క్యాంప్‌ని సందర్శించినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఎన్నో రకాల ఆనవాళ్లు అక్కడ ఉండడంతో ఆ చారిత్రాత్మక అంశాల గురించి తెలుసుకోవడానికి జాన్వి కపూర్ వరుణ్ తో కలిసి కూడా అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

వారికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బవాల్ షూటింగ్ అయితే దాదాపు చివరి దశలో ఉంది. ఆగస్టులో ఫైనల్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఇక పోస్టు ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసుకునే వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది.