Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు తెలుగు హీరోల‌పై మ‌న‌సు ప‌డింద‌ట‌

By:  Tupaki Desk   |   28 Dec 2022 4:20 AM GMT
ఆ ఇద్ద‌రు తెలుగు హీరోల‌పై మ‌న‌సు ప‌డింద‌ట‌
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి టాలీవుడ్ లో ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌సన న‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌దేవి వార‌సురాలు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఆరంగేట్రంపైనా చాలా కాలంగా చ‌ర్చ సాగుతోంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా దానికి ధృవీక‌ర‌ణ లేదు.

ఇటీవ‌ల జూ.ఎన్టీఆర్- కొరటాల సినిమాకు తొలి ఆప్ష‌న్ గా జాన్వీ పేరును ప‌రిశీలించార‌ని క‌థ‌నాలొచ్చినా అధికారికంగా టీమ్ క‌న్ఫామ్ చేయ‌లేదు. ఇంత‌లోనే జాన్వీ త‌న‌కు ఎవ‌రూ అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ఇవ్వ‌లేద‌ని ఒక‌వేళ అవ‌కాశం వ‌స్తే న‌టిస్తాన‌ని కూడా మీడియా తో అన్నారు.

తాజాగా మ‌రోసారి ఎన్టీఆర్ పై త‌న అభిమానాన్ని దాచుకోలేక‌పోయిన జాన్వీ క‌పూర్ బ‌హిరంగంగా ఓపెనైంది. బాలీవుడ్ యువ సంచలనం జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. గతంలో ఇదే విషయాన్ని చాలాసార్లు ధృవీకరించిన ఈ యువ‌న‌టి ఇప్పుడు మళ్లీ త‌న ప్రేమ‌ను కురిపించింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌ చూసిన తర్వాత తిరిగి వెళ్లి జనతా గ్యారేజ్‌ చూశాను. నేను జూనియర్ ఎన్టీఆర్ సార్ కి వీరాభిమానిని. అతనొక అద్భుత నటుడు అని జాన్వీ కితాబిచ్చింది.

ఇంకా మాట్లాడుతూ తాను తెలుగు హీరోలతో కలిసి పనిచేయడానికి ఆస‌క్తిగా ఉన్నాన‌ని అంది. జూనియర్ ఎన్టీఆర్ .. అల్లు అర్జున్ ల‌తో న‌టించేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని కూడా అంది. కొరటాల శివ- సుకుమార్ వంటి టాప్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేయాల‌నుంద‌ని కూడా జాన్వీ త‌న ఆకాంక్ష‌ను బ‌హిర్గ‌తం చేసింది. కొత్త సంవ‌త్స‌రంలో ఆ అవ‌కాశం వ‌స్తుంద‌నే ఆశిద్దాం.

ఎన్టీఆర్ తో ఖాయ‌మైన‌ట్టేనా? గత కొన్నేళ్లుగా అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లో ఆరంగేట్రం చేయ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అది సాధ్య‌ప‌డ‌లేదు. ఏడాది కాలంగా జూ.ఎన్టీఆర్- కొర‌టాల శివ కాంబినేష‌న్ సినిమాతోనే జాన్వీ ఎంట్రీకి అవ‌కాశం ఉంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ జాన్వీ క‌పూర్ ఈ చిత్రానికి సంత‌కం చేసేందుకు ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని టాక్ వినిపించింది.

అయితే జాన్వీ ఈ మూవీకి సంత‌కం చేయ‌డానికి కార‌ణం భారీ పారితోషికం డిమాండ్ ని నెర‌వేర్చ‌డంతో పాటు త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందికి అవ‌స‌ర‌మైన చెల్లింపులు చేసేందుకు మేక‌ర్స్ దిగి రావ‌డం కూడా ఒక కార‌ణ‌మ‌ని కూడా ఇటీవ‌ల‌ గుస‌గుస‌లు వినిపించాయి. ఎట్టి ప‌రిస్థితిలో ఈ సినిమాతో జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీకి ఒప్పించాల‌ని నిర్మాత‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారని....జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఖాయ‌మైన‌ట్టేన‌ని టాక్ వినిపించింది. కానీ నిర్మాతలు ఇంకా అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంటుంది.

ఇటీవ‌ల వ‌రుస‌గా వేడెక్కించే ఫోటోషూట్ల‌తో షో స్టాప‌ర్ గా నిలుస్తున్న జాన్వీ పై ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ఆస‌క్తి ఉంది. బాలీవుడ్ లో ఒక్కో సినిమాతో న‌టిగాను నిరూపించుకున్న ఈ బ్యూటీని టాలీవుడ్ కి ర‌ప్పిస్తే ఆ మేర‌కు పాన్ ఇండియా ప్లాన్ కి కూడా అద‌న‌పు బూస్ట్ ఇస్తుంద‌నేది మేక‌ర్స్ ఆలోచ‌న‌. ఇప్ప‌టికే ఎన్టీఆర్ 30 స్క్రిప్టు కాన్వాసు మారాయి. దానికి త‌గ్గ‌ట్టే బాలీవుడ్ నాయిక అవ‌స‌రం త‌ప్ప‌నిస‌రి. జాన్వీ డెబ్యూ సినిమా అయితే అతిలోక సుంద‌రి తెలుగు అభిమానుల్లోను బోలెడంత క్యూరియాసిటీ నెల‌కొంటుందని చ‌ర్చ సాగుతోంది.

ఫిబ్రవరి 2023లో చిత్రీకరణ ప్రారంభం కానున్న #NTR30 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా ట్ర‌య‌ల్ కోసం భారీ ప్ర‌యోగం చేయ‌బోతున్నారు. క‌థానాయిక ఎంపిక ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంది. అందుకే త్వ‌ర‌గా జాన్వీకి అడ్వాన్స్ మొత్తం చెల్లించి అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సి ఉంటుంద‌ని స‌మాచారం. తార‌క్ ప్ర‌స్తుతం కుటుంబంతో విదేశీ వెకేష‌న్ ని ఆస్వాధిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.