Begin typing your search above and press return to search.

బాబోయ్‌ శ్రీదేవి కూతురు ఏంటీ ఇలా అయ్యింది

By:  Tupaki Desk   |   27 April 2020 11:30 PM GMT
బాబోయ్‌ శ్రీదేవి కూతురు ఏంటీ ఇలా అయ్యింది
X
అతిలోక సుందరి శ్రీదేవి అంటే ఇప్పటికి ఎంతో మందికి అభిమానం. శ్రీదేవి చనిపోయిన సమయంలో ఆమె అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమె లేని లోటును కూతురు జాన్వీ కపూర్‌ తీర్చుతుందని అంతా ఆశ పడ్డారు. అనుకున్నట్లుగానే తల్లిలాగా జాన్వీ కపూర్‌ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించింది. మొదటి సినిమాతో కమర్షియల్‌ గా సక్సెస్‌ కాకున్నా నటిగా మాత్రం మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ మాత్రం కాస్త తేడాగా కొడుతోంది.

చిన్నప్పటి నుండే ఖుషీ కపూర్‌ పళ్లు కాస్త ఎత్తుగా ఉండేవి. చాలా కాలం పాటు ఖుషి వాటికి క్లిప్‌ పెట్టించుకుంది. పళ్లు సరి అయ్యాయి. త్వరలో ఈమె సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విదేశాల్లో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సును మరియు నటనకు శిక్షణను తీసుకుంది. ప్రస్తుతం కథలు వింటున్న ఈ అమ్మడు త్వరలోనే వెండి తెరపై కనిపించబోతుంది అనుకుంటున్న సమయంలో టిక్‌ టాక్‌ వీడియోలో ఈమెను చూసి చాలా మంది అవాక్కవుతున్నారు.

పలు ఆపరేషన్స్‌ చేయించుకుని అందానికి మెరుగులు దిద్దించుకున్నట్లుగా.. దవడలు జారిపోయి పెద్దవైన పెదాలతో ఈ అమ్మడు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈమె సాదారణంగా కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది కాని తాజా టిక్‌ టాక్‌ వీడియోలో మేకప్‌ వేసుకుంటూ ఉంది. సాదారణంగా జనాల్లోకి మేకప్‌ తో వెళ్లాలని నేను అనుకోను. కాని కొందరు మాత్రం మేకప్‌ చాలా ఎలా వేసుకుంటారు అంటూ ప్రశ్నించింది. ఈమె వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో ఈమె నిజంగా శ్రీదేవి కూతురేనా.. జాన్వీ కపూర్‌ చెల్లెలేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.