Begin typing your search above and press return to search.

ధఢఖ్ పిల్ల జిమ్ వర్కౌట్స్ చూశారా

By:  Tupaki Desk   |   19 Dec 2017 6:24 PM IST
ధఢఖ్ పిల్ల జిమ్ వర్కౌట్స్ చూశారా
X
బాలీవుడ్ లో ప్రస్తుతం అందరి చూపు సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పైనే ఉంది. తప్పకుండా తల్లిని మించిన హీరోయిన్ అవుతుందని సీనియర్ నటి నటులు ప్రశంసలను అందిస్తున్నారు. ఇక అందంలో కూడా ఏం తక్కువ కాదు అన్నట్టు స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మొదటి సినిమా కోసం ఈ బ్యూటీ చాలా కష్టపడుతోంది.

జాన్వీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది అని చెప్పినప్పటి నుండి చాలా మంది ఆమెకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం ధఢఖ్ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో స్లిమ్ గా కనిపించాలని జాన్వీ జిమ్ వర్కౌట్స్ ని ఏ మాత్రం తగ్గించడం లేదు. ఎలాగైనా మొదటి సినిమాతో మంచి హిట్ అందుకోవాలని చాలా కష్టపడుతోంది. ఇకపోతే రీసెంట్ అమ్మడికి సంబందించిన ఒక సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.

జిమ్ లో 5 నిమిషాల్లో సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడం ఎలా అనే విషయం గురించి వివరించి కొన్ని స్టెప్స్ ని చూపించింది. చూస్తుంటే జాన్వీ గ్లామర్ గర్ల్ రేంజ్ కి ఈజీగా చేరుకోగలదని ఆ వీడియో ను చూసినవారు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ధఢఖ్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరాఠి సైరత్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది.