Begin typing your search above and press return to search.

శ్రీదేవి కూతురి ‘బీఎఫ్’ సంగతి విన్నారా?

By:  Tupaki Desk   |   25 March 2016 7:48 AM GMT
శ్రీదేవి కూతురి ‘బీఎఫ్’ సంగతి విన్నారా?
X
వయసు మీద పడ్డా ఇప్పటికి అతిలోక సుందరిగా అందరి నోటా పిలిపించుకునే బాలీవుడ్ నటి శ్రీదేవి. ఆమె మీదున్న అభిమానంతో.. ఆమె కుమార్తెను కూడా వెండితెర మీద చూడాలని ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లు చాలామందే ఉన్నారు. దీనికి తగ్గట్లే ఆమ భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్న నేపథ్యంలో.. ఆమె కుమార్తె ఝాన్సీకపూర్ మీద మీడియా దృష్టి కాస్త ఎక్కువే.

ఆమెను ఓ కంట కనిపెడుతూ.. ఆమె చర్యల్ని అప్పుడప్పుడు కెమేరాల్లో బంధించి బయట ప్రపంచానికి చేయటం మామూలే. ఇదిలా ఉంటే.. తాజాగా ఝాన్వి కపూర్ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు చూసిన వాళ్లకు షాకింగ్ గా మారింది. ఓ కుర్రాడితో కలిసి సన్నిహితంగా ఉంటూ.. అతగాడిని ‘బీఎఫ్’’గా పేర్కొంటూ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు చర్చగా మారింది. బీఎఫ్ గా బాయ్ ఫ్రెండ్ గా చెప్పుకోవటం తెలిసిందే.

టీనేజర్ గా ఉన్న టైమ్ లోనే ఝాన్వి కపూర్ బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు పోస్ట్ చేయటం.. వారి మధ్య చనువు ఏ రేంజ్ లో ఉందన్న విషయం ఫోటోల్లోని ఫోజులు చూస్తుంటేనే అర్థమయ్యే పరిస్థితి. అయితే.. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరన్న విషయం బయటకు రాలేదు. సినిమాల్లోకి వచ్చేసి వెండితెరను ఏలేస్తుందన్నఅంచనాలతో ఉన్న వారు తాజా ఫోటోల్ని చూసి షాక్ తినే పరిస్థితి.

ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లోని ‘‘ది లీ స్టాస్ బెర్గ్’’ థియేటర్ అండ్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు చేస్తున్న ఝాన్సీ కపూర్ చదువు సంగతేమో కానీ.. తాజా బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలతో కపూర్ ఫ్యామిలీ డిఫెన్స్ లో పడినట్లేనని చెబుతున్నారు.

మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి