Begin typing your search above and press return to search.

జూ.ఎన్టీఆర్‌ తో శ్రీదేవి డాటర్‌?

By:  Tupaki Desk   |   28 Oct 2015 11:44 AM GMT
జూ.ఎన్టీఆర్‌ తో శ్రీదేవి డాటర్‌?
X
అమ్మో.. మన సినిమాల గురించి మనోళ్ళు పుట్టించే గాసిప్పుడు ఒకెత్తు అయితే.. మన గురించి పక్క స్టేట్‌ లో వచ్చే గాసిప్పులు ఇంకో ఎత్తు. ప్రముఖ తమిళ మ్యాగజైన్‌ వికటన్‌.. ఇప్పుడు మనకే తెలియని ఒక కత్తిలాంటి న్యూస్‌ తో భారీ షాకే ఇచ్చింది.

మొన్నేమో ఆలియా భట్‌.. తరువాత అమైరా దస్తూర్‌.. తాజాగా పరిణితి చోప్రా.. త్వరలో షూటింగ్‌ కు వెళ్ళనున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ - కొరటాల శివ సినిమాలో ఇప్పటివరకు వినిపించిన హీరోయిన్స్‌ పేర్లు. అయితే వీరిలో పరిణితి చోప్రా దాదాపు కన్ఫాం అంటూ ఈరోజు ఉదయం ఒక న్యూస్ వచ్చింది. కాని తమిళనాట జూనియర్‌ గురించి మరో న్యూస్‌ ప్రచారంలో ఉంది. ఇప్పటివరకు వెండితెర మీద ఏ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలో సతమతమవుతున్న జాన్వి కపూర్‌.. అదేనండి.. సీనియర్‌ నటి శ్రీదేవి కూతురు.. ఇప్పుడు నందమూరి చంద్రుడి సినిమాతో ఎంట్రీ ఇస్తోందట. ఇది పక్కా న్యూస్‌ అంటూ తమిళ పత్రిక వాదిస్తోంది.

కట్‌ చేస్తే.. ఈ మధ్యనే విజయేంద్ర ప్రసాద్‌ సినిమాలో శ్రీదేవి కూతురు హీరోయిన్‌ గా పరిచయమవనుందా అంటూ న్యూస్‌ రాగా.. అవన్నీ కేవలం రూమర్లని.. మా అమ్మాయి ఇంకా చదువుకుంటోందని.. ఆమె తండ్రి బోనీ కపూర్‌ చెప్పుకొచ్చారు. మరి తమిళ తంబీలకు ఈ ఇన్షర్మేషన్‌ ఎలా వచ్చిందో తెలియదు కాని.. అసలు కొరటాల శివ క్యాంపు నుండే అలాంటి సిగ్నల్స్‌ ఏమీ రావట్లేదు.