Begin typing your search above and press return to search.

శ్రీదేవి కూతురికి ఫుల్ గిరాకీ

By:  Tupaki Desk   |   17 Feb 2016 9:30 AM GMT
శ్రీదేవి కూతురికి ఫుల్ గిరాకీ
X
అలనాటి అందాల హీరోయిన్ శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్విని హీరోయిన్ గా తామే ఇంట్రడ్యూస్ చేస్తామంటూ బాలీవుడ్ సంస్థలు ఒకదానితోఒకటి పోటీపడుతున్నాయట. జాన్వి లాంఛింగ్ ఛాన్స్ తమకే ఇవ్వాలంటూ సంస్థలన్నీ శ్రీదేవి ముందు క్యూ కడుతున్నాయట. ఆ ఛాన్సు దక్కించుకోవడం కోసం ఇప్పుడే అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా రెడీ అంటు పలు సంస్థలు శ్రీదేవి వెంటపడుతున్నాయట.

తమ పోటీదారులు ఎక్కడ ఆ ఛాన్సు తన్నుకు పోతారో అన్న భయంతో నిర్మాణ సంస్థలు ఎవరికి వారు రెండుమూడు నెలలకోసారి శ్రీదేవి కలసి ఇంకెందుకు ఆలస్యం లాంఛ్ చేసేద్దాం అంటూ తెగ తొందర పెడుతున్నారు. అయితే.. శ్రీదేవి మాత్రం అప్పుడే ఎందుకు అంటూ వాయిదా వేస్తోంది. డిమాండ్ మరింత పెంచడానికే శ్రీదేవి ఇలా వాయిదాలు మీద వాయిదాలు వేస్తోందని వినికిడి. రీసెంట్‌ గా కరణ్‌ జోహార్‌ తో పాటు యష్‌ రాజ్‌ సంస్థ కూడా సరాసరి జాన్వినే కలిసి హీరోయిన్‌ గా పరిచయం చేస్తామంటూ కళ్లు చెదిరే ఆఫర్‌ ఇచ్చారట.

అయితే.... భారీ ఆఫరే అయినా కూడా ఇంతేనా అంటూ పెదవి విరిచేసిందని టాక్. వారు తొలుత జాన్వినే సంప్రదించగా ఆమె అది చాలా చిన్న అమౌంట్ అంటూ తన తల్లిని కలవమని చెప్పి పంపించిందట. అక్కడ శ్రీదేవి కూడా ఆ ఆఫర్ ను తేలిగ్గా తీసిపడేసింది. జాన్వి పట్ల బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందని గుర్తించిన శ్రీదేవి ఆ అవకాశాన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది.. అందుకే చాలా ప్లాన్డ్ గా వ్యవహరిస్తోందామె.