Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బులుగు జిలుగు జాన్వీ

By:  Tupaki Desk   |   25 Dec 2018 1:30 AM GMT
ఫోటో స్టోరి: బులుగు జిలుగు జాన్వీ
X
`ధ‌డ‌క్` సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, ఆ త‌ర్వాత `త‌ఖ్త్` లాంటి భారీ హిస్టారిక‌ల్ చిత్రంలో అవ‌కాశం అందుకుని ఇండ‌స్ట్రీ క‌ళ్లు త‌న‌వైపు తిప్పేసుకుంది. క‌ర‌ణ్ జోహార్‌తో క‌లిసి బోనిక‌పూర్ వేసిన ప్లాన్ మామూలుగా వ‌ర్క‌వుట‌వ్వ‌డం లేదు. త‌న కుమార్తె జాన్వీని పెద్ద స్టార్ ని చేయ‌డ‌మే ధ్యేయంగా బోనీ చేస్తున్న ప్ర‌య‌త్నం ప్ర‌తిదీ సానుకూల ఫ‌లితాల్ని ఇస్తోంది. అస‌లు ఫేజ్ 3 ప్ర‌పంచంలో ఎలా ఉంటే అవ‌కాశాలు వ‌స్తాయో అన్ని ర‌కాల టిప్స్‌ని నూరి పోసిన అతిలోక సుంద‌రి స్వ‌ర్గ‌లోకం నుంచి ఈ మొత్తం ప్రాసెస్‌ ని వీక్షిస్తోంది. కూతురు తొలి ప్ర‌య‌త్నం పెద్ద స‌క్సెస్. ధ‌డ‌క్ విజ‌యాన్ని ఇహ‌లోకం లో ఉండి చూడ‌లేక‌పోయినా పై నుంచి శ్రీ‌దేవి చూస్తేనే ఉన్నారు.

అదంతా అటుంచితే .. జాన్వీ ప‌బ్లిక్ అప్పియ‌రెన్సులు ప్ర‌స్తుతం యువ‌త‌రంలో హాట్ టాపిక్. జాన్వీ ఎక్క‌డికి వెళ్లినా అక్క‌డ సంద‌ర్భాన్ని బ‌ట్టి డ్రెస్ కోడ్ మెయింటెయిన్ చేస్తూ అగ్గి రాజేస్తోంది. గ‌ల్లీలోకి వెళితే ఒక‌లా.. ప‌బ్బు, క్ల‌బ్బుకి వెళితే ఇంకోలా, రెస్టారెంట్, పార్టీకి వెళితే మ‌రోలా.. అన్ని విధాలుగా త‌న‌ని తాను ఫ్యాష‌నిస్టాగా ఆవిష్క‌రించుకుంటూ నిరంతరం హాట్ టాపిక్ అవుతోంది. ఈ స్టైలింగ్ వెన‌క శ్రీ‌దేవి టిప్స్‌తో పాటు క‌ర‌ణ్ జోహార్ టిప్స్ ప్ర‌ముఖంగా ప‌ని చేశాయ‌న్న‌ది ఆల్వేస్ హాట్ టాపిక్.

తాజాగా ముంబైలోని ఖ‌రీదైన సెల‌బ్రిటీలు ఉండే జుహూ ఏరియాలో జాన్వీ ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ క‌ల‌కలం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. అక్క‌డ ఓ రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ క‌నిపించిన జాన్వీ అదిరిపోయే డ్రెస్ కోడ్‌తో మైమ‌రిపించింది. పూర్తిగా బులుగు జిలుగు సూట్‌లో ప్ర‌త్య‌క్ష‌మై వేడి పెంచింది. త‌న‌తో పాటే అక్క‌డ స్నేహితులు త‌నీషా సంతోషి క‌నిపించింది. రోహిత్ ధావ‌న్ & ఫ్యామిలీ అదే రెస్టారెంట్ లో డైనింగ్ చేసి వెళుతుండ‌గా కెమెరా క‌ళ్లు ఫ్లాష్‌లు మెరిపించాయి.