Begin typing your search above and press return to search.

మాజీ సీఎం మనవడికి శ్రీదేవి కూతురు లిప్ లాక్

By:  Tupaki Desk   |   2 Aug 2016 5:30 AM GMT
మాజీ సీఎం మనవడికి శ్రీదేవి కూతురు లిప్ లాక్
X
అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవీ మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ లో ఉన్న ఆమెకు సంబంధించిన కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. సంచలనంగా మారిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. మాజీ కేంద్రమంత్రి.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన సుశీల్ కుమార్ షిండే మనమడు కమ్ తన బాయ్ ఫ్రెండ్ అయిన శిఖర్ పహారియాతో కలిసి హద్దులు దాటినట్లుగా కనిపిస్తున్న ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

షిండే మనమడితో శ్రీదేవి కుమార్తె లిప్ లాక్ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న ఈ ఫోటోలు ఎప్పటివన్నవి తెలీటం లేదు. రీల్ లైఫ్ లో ఇలాంటి చిన్నెలు ఎన్ని ఉన్నా ఫర్లేదు కానీ.. ఇంకా కెరీర్ స్టార్ట్ చేయకముందే ఇలాంటివి చిన్నదాని కెరీర్ మీద ప్రభావం చూపిస్తాయన్న మాట వినిపిస్తోంది. ఇక.. షిండే మరో మనవడు వీర్ కు సంబంధించిన ఒక వార్త కూడా ఆ మధ్య హాట్ న్యూస్ గా మారింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారాతో డేటింగ్ చేయటం.. దానికి సంబంధించిన కొన్ని ముచ్చట్లు ఈ మధ్యన బయటకు వచ్చాయి. వివాదాస్పద విషయాల్లోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండే శ్రీదేవికి భిన్నంగా ఆమె కుమార్త ఇలా వ్యవహరించటం బోనీ కపూర్ ఫ్యామిలీ ఎంత ఇబ్బందిగా మారుతుందో..?